ఆంధ్రప్రదేశ్‌

పొత్తులపై నిర్ణయం తీసుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్యాణదుర్గం, డిసెంబర్ 13 : 2019 ఎన్నికల్లో పొత్తులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అధిష్ఠానం నిర్ణయం మేరకే పని చేస్తామని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం రఘువీరా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయడానికే పని చేస్తుందని, ఆపై పార్టీ పెద్దల నిర్ణయం మేరకు ముందుకెళ్తామని వివరించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, చర్చించలేదని తెలిపారు. తెలంగాణాలో పొత్తులతో ఎన్నికలకు వెళ్లగా అక్కడి ప్రజలు పొత్తులను తిరస్కరించారన్నారు. ఏపీలో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి పార్టీని బలోపేతం చేస్తున్నామని, అందులో భాగంగానే ఇటీవల ఇంటింటికీ కాంగ్రెస్ పార్టీ పేరుతో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నామన్నారు. ఇక ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, రాహుల్‌గాంధీ తీవ్రంగా కృషి చేయడం వల్లే ఆ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించామని, బీజేపీ బలహీన పడిపోయిందని తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, రాహుల్ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. 2019 ఎన్నికల్లో తాను కళ్యాణదుర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని రఘువీరా స్పష్టం చేశారు.