ఆంధ్రప్రదేశ్‌

జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 14: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎప్పటికీ గెలవలేదని, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప ఘాటుగా విమర్శించారు. కడప నగరంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎవరో గెలిస్తే వైకాపా నేతలు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సంబరాలు చేసుకోవాల్సిందేనని, వారు మాత్రం ఎప్పటికీ గెలవలేరని అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ గెలిస్తే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకోవడం, ఆ పార్టీ అధ్యక్షుడు తమ పార్టీనే గెలిచినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టిఆర్‌ఎస్‌కు తాము మద్దతు ఇస్తున్నామని, వారి మద్దతు తీసుకుంటామని చెప్పే ధైర్యం కూడా లేదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డుపడడం తప్ప ప్రతిపక్ష నేతగా జగన్ చేసిందేమీలేదన్నారు. కనీసం ఈ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, జిల్లా సమస్యలు, అభివృద్ధి గురించి మాట్లాడడం లేదని అన్నారు. ప్రజలు ఇదంతా గమనించాలని అన్నారు. నాలుగేళ్లుగా జిల్లా ప్రజలు ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రం వైపు చూస్తుంటే, జగన్ ఒక్కసారి కూడా ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. ఆయనకు కేవలం ముఖ్యమంత్రి కావాలనే యావతప్ప జిల్లా, రాష్ట్ర అభివృద్ధి పట్టడం లేదన్నారు. సొంతంగా గెలవలేక లోపాయికారిగా ఇతర రాష్ట్రాల్లోని పార్టీలతో, బీజేపీతో ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు.
రాష్ట్రం మొత్తం అధునాతన టెక్నలజీతో పోలీసుస్టేషన్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలిచారని హోంమంత్రి అన్నారు. కడపలో నగరంలో అధునాతన టెక్నాలజీతో నిర్మించిన మోడల్ పోలీసుస్టేషన్లను సీఎం రిమోట్ ద్వారా ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో 70 మోడల్ పోలీసుస్టేషన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 15 వేల పోలీసుల లోటు ఉందని, ఇటీవల 6 వేల మందిని నియమించామన్నారు. వారంతా శిక్షణలో ఉన్నారన్నారు. త్వరలో మరో 3150 మంది కానిస్టేబుళ్ల నియామకం చేపట్టనున్నామన్నారు. రాష్ట్రంలో నేరాల అదుపునకు పోలీసు వ్యవస్థను అధునాతన టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, స్వచ్చంధ సంస్థల, సహకారంతో అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు.