ఆంధ్రప్రదేశ్‌

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, డిసెంబర్ 14: వైద్య పరికరాల తయారీలో ఆధునిక, సాంకేతిక విప్లవాత్మక మార్పులకు ఈ అంతర్జాతీయ వైద్య ఉపకరణాల సదస్సు నాంది పలుకుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, పౌర విమానయాన శాఖా మంత్రి సురేష్ ప్రభు అన్నారు. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ వద్ద గల ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్‌లో రెండో రోజు శుక్రవారం జరిగిన అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్‌లో వైద్య పరికరాల తయారీ సంస్థలను ఏర్పాటు చేసిన పెట్టుబడిదారులపై ఆయన వరాలు కురిపించారు. మెడ్‌టెక్ జోన్ పరిశ్రమల పెట్టుదారులకు అవసరమైన వాయు రవాణా, లాజిస్టిక్ సౌకర్యాలను కల్పిస్తామని ప్రకటించారు. మెడ్‌టెక్ జోన్‌లో తయారయ్యే వైద్య పరికరాలను, విడి భాగాలను భారత ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కొత్త విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తామన్నారు. సాంకేతికంగా వస్తున్న విప్లవాత్మక మార్పుల కారణంగా దేశంలో ఔషధ, వైద్య ఉపకరణాల పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. వైద్య రంగంలో వైద్య ఉపకరణాల ఉత్పత్తి, అమ్మకం కీలక పాత్ర పోషిస్తాయన్నారు. భారత్‌లో తయారవుతున్న ఔషధాలకు మంచి గిరాకీ ఉందన్నారు. వైద్య పరికరాల మార్కెట్ కూడా అదే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వైద్య రంగంలో వస్తున్న ఆవిష్కరణలను, ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం ప్రజల ఆయు ప్రమాణాలను గణనీయంగా పెంచాయన్నారు. మెరుగైన జీవన ప్రమాణాల కారణంగా గత తరం వారితో పోల్చితే ప్రస్తుత తరం ఆయుప్రమాణాలు వృద్ధి చెందాయన్నారు. భవిష్యత్ తరాల జీవనకాలం మరింతగా అభివృద్ధి చెందితుందన్నారు. ఏ దేశానికైనా ఆ దేశ ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. నాణ్య మైన జీవితాన్ని గడిపేందుకు ప్రజల మెరుగైన ఆర్థిక పరిస్థితులు దోహదపడుతున్నాయన్నారు. వైద్య ఉపకరణాల్లో ఆధునికత మానవుల జీవితాలపై మరింత ప్రభావం చూపుతాయన్నారు.
రాబోయే రోజుల్లో బిలియన్ డాలర్ల వ్యాపారం వైద్య పరికరాల జోన్లలో జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో కాస్మోటిక్ రంగానికి మంచి భవిష్యత్ ఉందన్నారు. భారత భవిష్యత్ అభివృద్ధికి కొత్త ఆవిష్కరణలు వారిధిగా నిలుస్తాయన్నారు. ఆవిష్కరణలను ప్రోత్సాహించేందుకు మెడ్‌టెక్ జోన్స్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమలు అంతకంటే దోహద పడతాయన్నారు. జాతీయ వైద్య ఉపకరణాల విధానం భవిష్యత్ ప్రగతికి దోహదం అవుతుందన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడ్‌టెక్ జోన్లలో తయారయ్యే వైద్య ఉపకరణాలను ప్రమోట్ చేయాలని కోరారు. విశాఖపట్నం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందడం వలన మెడ్‌టెక్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమల అభివృద్ధికి అపార అవకాశాలు ఉంటాయన్నారు. విశాఖపట్నం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. వైద్య రంగంలో ఎదురౌతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉంటుందన్నారు. దేశ ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచేందుకు వైద్య సంక్షేమాలను కేంద్ర ప్రభుత్వ చేపడుతోందన్నారు.