ఆంధ్రప్రదేశ్‌

రైల్వే జోన్ ఎలా ఇస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 14: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుకు తొలి నుంచీ అన్నీ అడ్డంకులే. ఏ ఒక్కటీ సవ్యంగా జరగడం లేదు. జోన్ ఏర్పాటుకు కావాల్సిన భూములు ఒక్క విశాఖ నగరంలోనే ఉన్నాయి. అయినా కేవలం సాంకేతికపరమైన కారణాలతో జోన్ ఏర్పాటు ప్రకటనకు మొదటి నుంచి రెడ్‌సిగ్నల్ పడుతూనే ఉంది. సున్నితమైన ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనే నిర్ణయానికి కేంద్రం ఇప్పటికీ రాలేకపోతోంది. రాష్ట్ర విభజన హామీలో ఉన్న ప్రత్యేక రైల్వేజోన్ డిమాండ్ కూడా ఈనాటిది కాదు. గత కొనే్నళ్ళనాటి ఈ సమస్య ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనైనా పరిష్కారమవుతుందని భావించిన ఉత్తరాంధ్ర ప్రజానీకం, రైల్వేవర్గాల ఆశలపై ఇపుడు ఒడిశా నీళ్ళు జల్లుతోంది. అసలు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఎలా ఇస్తారు? సరిహద్దులేమైనా తేల్చారా? ఒకవేళ తేల్చితే ఎంత వరకు ఒడిశా పరిధిని ఉంచుతున్నారు? తెలుగు ప్రాంతాలతో కూడిన జోన్‌నిస్తే తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒడిశాలో అంతర్భాగమయ్యే డివిజన్లను, వీటి పరిధిలోకి వచ్చే ఒడిశా పరిసర ప్రాంతాలను విడదీస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు
చేస్తోంది. దీంతో కేంద్రం ఇపుడు మళ్ళీ ఆలోచనలో పడింది. భారతీయ రైల్వేకు గుండెకాయ వంటిదైన కిరండల్ మార్గంలో ఉన్న అన్నీ ప్రాంతాలను ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జోన్‌లోనే ఉంచాలనేది తొలి నుంచి ఒడిశా ప్రభుత్వం డిమాండ్. దీనికి అనుగుణంగానే ఆంధ్రా సరిహద్దులుగా చెప్పుకునే తూర్పుకనుమల్లో ఉన్న అరకు ప్రాంతం వరకే కొత్త జోన్ పరిధిలోకి తీసుకోవాలంటూ ఒడిశా కేంద్రానికి మెలిక పెడుతోంది. ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే ఖుర్ధా, సంబల్‌పూర్, వాల్తేరు డివిజన్లకు సంబంధించిన భౌగోళిక స్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉందని కూడా ఒడిశా చెబుతోంది. చత్తీస్‌గఢ్, ఆంధ్రా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ జోన్‌లోకే వస్తున్నాయి. ఈ విధంగా జగదల్‌పూర్, చత్తీస్‌గఢ్, రాయగడ, కొరాపుట్ వీటన్నింటినీ ఏ జోన్‌లోకి తీసుకురావాలనేది ఇపుడు ప్రశ్నగా మారింది. వీటన్నింటి సరిహద్దులు తేలితే తప్ప జోన్ వ్యవహారం కొలిక్కి రానేరాదని ఒడిశా మొండిపట్టు పడుతోంది. అన్నీ సవ్యంగా జరిగితే కొన్ని ప్రాంతాలను కలుపుకుని రాయగఢను, విశాఖను కొత్త డివిజన్లుగా చేసి దీనికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండే మరికొన్ని ప్రాంతాలతో మొత్తం మూడు డివిజన్లతో విశాఖలో ప్రత్యేక రైల్వేజోన్‌గా ఏర్పాటు చేయాలనే కేంద్రం ఆలోచనకు ఇపుడు ఒడిశా బ్రేక్ వేస్తోంది. దీంతో జోన్ కథ మళ్ళీ మొదటికే వచ్చినట్టు అయ్యింది. తెలుగు ప్రాంతాలనే విభజించి జోన్ చేయాలనుకుంటే వాల్తేరు డివిజన్‌లో మిగిలేది కేవలం ఒక్క అరకు ప్రాంతం మాత్రమే. విశాఖ నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉండే కిరండల్ మార్గంలోనే అత్యధికంగా సరకు రవాణా జరుగుతోంది. రోజూ పదికి పైగానే గూడ్స్‌రైళ్ళు నడుస్తుంటాయి. ఈ విధంగా వీటి ద్వారా ప్రతి ఏడాది ఏడు వేల కోట్ల రూపాయల మేర వాల్తేరు డివిజన్‌కు ఆదాయం వస్తోంది. ఇపుడు వాల్తేరు డివిజన్‌లో తెలుగు ప్రాంతాలను విడదీసి, ఒడిశా అంతర్భాగంలోకి వచ్చే ప్రాంతాలన్నింటిని ఈస్ట్‌కోస్ట్‌లోనే ఉంచుకుంటే ఈ డివిజన్‌కు వచ్చే ఆదాయాన్ని అంతటినీ కోల్పోయినట్టే. అందువల్లనే ఒడిశా ఈ మెలిక పెట్టిందని ఇక్కడి రైల్వేవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అపుడు మిగిలేది తెలుగు ప్రాంతాలు, ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడాల్సి ఉంటుంది. అందువల్ల ఈ చిక్కుముడిని కేంద్రం ఏ విధంగా విప్పుతుందోనని ఉత్తరాంధ్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నందున జోన్ విషయం తేలాల్సిందేనంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క బడ్జెట్ సమయమూ సమీపిస్తోంది. రానున్న బడ్జెట్‌లోనైనా జోన్ ప్రకటన చేయకపోతే భవిష్యత్‌లో దీనిని సాధించడం కష్టమేనన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. రైల్వేబోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ ప్రజాప్రతినిధులు, ఇది కేవలం ‘పొలిటికల్ డెషిషన్’తోనే సాధ్యపడుతుందంటూ రైల్వే పరస్పర వాదనలతోనే నాలుగున్నరేళ్ళు గడిచిపోయాయి. ఇపుడు తీరా ఏమీ చేయలేక అంతా చేతులెత్తెసిన పరిస్థితులు నెలకొనడంపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.