ఆంధ్రప్రదేశ్‌

తుపాను సహాయక చర్యల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 14: పెథాయ్ తుపాను కోస్తాంధ్ర తీరంలోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాల పరిధిలో తుపాను సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేశారు. ఆ శాఖ మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం 24 గంటలూ పని చేయనుంది. భారత వాతావరణ శాఖ నుంచి తాజా సమాచారం తీసుకుంటూ ఈ సమాచారాన్ని రియల్ టైమ్ గవర్నెన్సు సొసైటీ సహకారంతో ఆయా శాఖల అధికారులకు ఈ ప్రత్యేక విభాగం చేరవేస్తోంది. ఇతర శాఖలతో, జిల్లా అధికార యంత్రాంగంలో సమాచారాన్ని మార్పిడి చేసుకుంటూ తుపాను సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా అన్ని పథకాలను పూర్తిగా నింపి ఉంచాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే, పథకాల నిర్వహణకు వీలుగా జనరేటర్లను, నీటిని తరలించేందుకు ట్యాంకర్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. నీటి పథకాలు, బోర్లు అన్నీ పని చేసేలా చూడాలని సూచించారు. నీటి సరఫరాకు, పారిశుద్ధ్య నిర్వహణకు ఆయా ప్రాంతాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. బ్లీచింగ్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు.