ఆంధ్రప్రదేశ్‌

రెండు మున్సిపాలిటీలు సహా ఏడు మండలాలు ‘గుడా’ పరిధిలోకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 14: గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ (గుడా) పరిధిని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా రెండు మున్సిపాలిటీలు సహా ఏడు మండలాలను గుడా పరిధిలోకి చేర్చింది. తుని, రామచంద్రాపురం మున్సిపాలిటీలను, తొండంగి, తుని, తాళ్లరేవు, శంఖవరం, కరప మండలాల్లోని కొంత భాగం, రామచంద్రాపురం, రావులపాలెం మండలాలను చేర్చారు. ఈ మండలాల పరిధిలో 74 గ్రామాలను గుడా పరిధిలోకి రావడంతో, గుడా పరిధి 557 చదరపు కిలోమీటర్ల నుంచి 2740 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది.

రాష్ట్రంలో చిత్ర నిర్మాణంపై చైనా ఆసక్తి * పర్యాటక ప్రాంతాల్లో పర్యటించనున్న సాంస్కృతిక బృందం

విజయవాడ, డిసెంబర్ 14: రాష్ట్రంలో చిత్ర నిర్మాణంపై చైనా అసక్తి కనబరుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ పర్యాటక కేంద్రాల్లో పర్యటించి, చిత్ర నిర్మాణానికి అనువైన ప్రాంతాలను పరిశీలించనుంది. ఈ మేరకు ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్నన్ అంబికా కృష్ణతో చైనా సాంస్కృతిక బృందం విజయవాడలో శుక్రవారం భేటీ అయింది. 11 మంది సభ్యుల చైనా బృందం రెండు దేశాల్లో చిత్ర నిర్మాణానికి సహకరించుకునే అంశంపై చర్చించారు. సినిమా హాళ్ల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో అనేక చారిత్రక ప్రాంతాలు, పురావస్తు సంపద, ప్రకృతి అందాలు ఉన్నాయని, అక్కడ చిత్ర నిర్మాణం చేసే అవకాశాలు ఉన్నాయని కృష్ణ తెలిపారు. చైనా బృందంలో సినీ నిర్మాత ఝాంగ్ యాంగ్‌వౌ నింకా, సైనో-్ఫరిన్ కల్చరల్ ఎక్సేంజ్ బోర్డు చైర్మన్ ఫాంగ్ జియాగ్లిన్ తదితరులు ఉన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త * పండుగ అడ్వాన్స్ ప్రకటన
విజయవాడ(సిటీ), డిసెంబర్ 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు రానున్న పండుగకు తీపి కబురు అందింది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా పండుగ అడ్వాన్సుగా ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్టీసీలోని క్లాస్ 3 కార్మికులకు, ఉద్యోగులకు 4500 రూపాయలను, క్లాస్ 4 కార్మికులకు, ఉద్యోగులకు 4000 వేల రూపాయల పండుగ అడ్వాన్సును ఇవ్వాలని ఆర్టీసీ ఎండి సురేంద్రబాబు నిర్ణయించారు. ఈ అడ్వాన్సుతో ప్రస్తుతం పని చేస్తున్న సుమారు 40 వేల మంది సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. వచ్చే ఎడాది జవనరి నెల జీతాలతో పాటుగా ఈ పండుగ అడ్వాన్సును కూడా ఆర్టీసీ సంస్ధ ఉద్యోగులకు చెల్లించనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఎండీ సురేంద్రబాబు శుక్రవారం విడుదల చేశారు. అలాగే ఆర్టీసీతో అనుబంధంగా ఉన్న సీసీఎస్ సభ్యులకు శుభవార్త వచ్చింది. ఇప్పటి వరకు సంస్థలో పని చేసే ఉద్యోగులకు ఈడీఎస్ లోన్ కింద ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచారు. దీనిలో భాగంగా ప్రస్తుతం ఈడీఎస్ లోన్స్‌కింద ఇస్తున్న మొత్తాన్ని రెండు లక్షల రూపాయల నుండి రెండు లక్షల 25 వేల రూపాయలకు పెంచారు. అలాగే ఎస్‌టీఎల్ లోన్స్‌ను 100 శాతం నుండి 120 శాతానికి పెంచారు.
అసెంబ్లీలో మీడియా ప్రవేశంపై ఆంక్షలు
విజయవాడ(సిటీ), డిసెంబర్ 14: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రదేశంలోనికి వచ్చే మీడియా ప్రతినిధులతో పాటు ఉద్యోగుల రాకపోకలపై అసెంబ్లీ కార్యాలయ అధికారులు కొత్త ఆంక్షలను విధించారు. అసెంబ్లీలోకి వచ్చే మీడియా, ఉద్యోగుల ప్రవేశానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోనికి వచ్చే మీడియా, ఉద్యోగులు గేట్ నెంబర్ 2 ద్వారా మాత్రమే రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం నుండి అసెంబ్లీలోనికి మీడియాను రాకుండా పూర్తిగా నిషేధించారు. అసెంబ్లీ ఉద్యోగుల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించిన అధికారులు ఇక వారు కూడా గేట్ నెం 2 ద్వారానే పూర్తి తనిఖీల అనంతరం అసెంబ్లీలోనికి రావాలన్నారు. ఆధార్ కార్డుతో నమోదు చేసుకుంటేనే అసెంబ్లీలోకి ప్రవేశించే విధంగా నూతన నిబంధనలను అమలులోనికి తీసుకు వచ్చారు. అసెంబ్లీ స్పీకర్ ఆదేశాల మేరకే ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి విజయరాజు తెలిపారు.