ఆంధ్రప్రదేశ్‌

విద్యా రంగంపై ప్రభుత్వాల నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 15: కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న రాజకీయ పార్టీలు విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) జాతీయ కార్యదర్శి నితీష్ నారాయణన్ ధ్వజమెత్తారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ‘విద్యారంగంలో మార్పులు - సవాళ్లు’ అంశంపై విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశ జీడీపీలో విద్యారంగానికి 6 శాతం నిధులు కేటాయించాలంటూ 1966లో కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదికకు ఐదు దశాబ్ధాలైనా మోక్షం లేదన్నారు. స్వాతంత్య్రానంతరం ఇప్పటి వరకూ పాలక పక్షాలు విద్యా రంగానికి దేశ జీడీపీలో కేవలం 3 శాతం మాత్రమే నిధులు కేటాయిస్తూ తమ వైఖరిని చాటుకుంటున్నామని మండిపడ్డారు. చట్టబద్దంగా ఏర్పాటైన యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని నిర్లక్ష్యం చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను తీసుకురావడం కుట్రపూరితమేనన్నారు. విద్యా రంగాన్ని పూర్తిగా ప్రైవేటు పరంచేసే క్రమంలో ప్రైవేటు యూనివర్శిటీలకు ఎర్రతివాచీ పరుస్తున్నారన్నారని ఆరోపించారు. కేవలం కాగితాలకే పరిమితమైన జియో యూనివర్శిటీకి కేంద్రం రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యా వంతులైన యువత దేశ ప్రగతికి బాటలు వేస్తారని, అయితే యువతకు విద్యా సదుపాయాలు కల్పించకుండా విగ్రహాలకు నిధులు కేటాయిస్తున్నారని ప్రధాని మోదీ తీరును ఖండించారు. గుజరాత్‌లో సర్ధార్ వల్లభాయ్ పటేల్, ముంబైలో ఛత్రపతి శివాజీ విగ్రహాలకు వేల కోట్లు కేటాయిస్తూ యువతను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. విగ్రహాలకు కేటాయించే నిధులు, ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చులతో దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తే వేలాది మంది యువత చదువుకుంటారన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన కేంద్రం దేశంలో పౌర, మానవ, రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు అధికారాన్ని ఉపయోగిస్తోందని మండిపడ్డారు. కేంద్రం తీరును ప్రశ్నించి, నిలదీసే విద్యార్థులపై దేశద్రోహం కేసులు నమోదు చేస్తూ జైళ్లలో పెడుతున్నారన్నారు. అసలైన దేశద్రోహులే రాజ్యాంగంలోని లౌకిక, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమేర్పడేలా చట్టాలు రూపొందిస్తున్నారని ఆరోపించారు.
ఈ విధానాలపై ఎస్‌ఎఫ్‌ఐ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే తీరున వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
కమలనాథన్ కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2.4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూతూ మంత్రంగా కొన్ని ఖాళీలను భర్తీ చేసి మరోసారి నిరుద్యోగులను, చదువుకున్న యువతను మభ్యపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే యువత ప్రశ్నించే ఒరవడిని అలవరచుకోవాలని సూచించారు.