ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వాసుపత్రుల్లో పేషెంట్ యాక్సిస్ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 17: రాష్టవ్య్రాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు అధునాతన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు నూతన విధానానికి రూపకల్పన చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు వైద్యం అందించే సమయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు, ఆసుపత్రిలో రోగుల రద్దీని తగ్గించేందుకు పేషంట్ యాక్సిస్ కార్డు విధానానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జనవరి నుంచి ఈ విధానాన్ని రాష్టవ్య్రాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేస్తున్నారు.
ఆసుపత్రిలో ఇన్ పేషంట్ రోగులకు ఈ కార్డుల ద్వారా సేవలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆసుపత్రిలో రోగుల సహాయకుల సంఖ్య తగ్గించడం, పారిశుద్ధ్యాన్ని పెంచడం, వైద్యసేవల్లో అందే జాప్యాన్ని నివారించడం, ఆసుపత్రిలో పిల్లల అపహరణను నిరోధించేందుకు ఈ కార్డు విధానానికి శ్రీకారం చుట్టారు. జనవరి నుంచి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈ కార్యక్రమానికి ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ విధానంలో భాగంగా రోగి ఆసుపత్రికి వచ్చినప్పటి నుండి అందించే వైద్యసేవలు, వినియోగించే మందులు, వైద్యులు, వార్డు, రోగి వెంట సహాయకులుగా వచ్చిన వారి వివరాలను కార్డులో పొందుపరుస్తారు. రోగికి అందాల్సిన, అందుతున్న వైద్యసేవల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ సిస్టమ్‌లో నమోదవుతుంది. ప్రతి ఆసుపత్రిలో విభాగాల వారీగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ఎలక్ట్రికల్ గేట్ సిస్టమ్‌ను ముందుగా ఆయా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తారు.
రోగికి అందించిన యాక్సిస్ కార్డును స్కాన్ చేయగానే గేటు తెరుచుకుంటుంది. అనంతరం ఆ వార్డులోని వైద్యులు, సిబ్బంది రోగిని పరీక్షించి అవసరమైన సేవలు అందిస్తారు. ప్రస్తుతం గుంటూరు వైద్యశాలలో అవసరమైన 10 ప్రదేశాలలో యాక్సిస్ గేట్లు అమర్చేందుకు ప్రణాళికను రూపొందించారు. దీనిపై ఇప్పటికే జిల్లా పరిపాలనాధికారి కోన శశిధర్, జీజీహెచ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు.