ఆంధ్రప్రదేశ్‌

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 18: పెథాయ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్‌లైన్లు, సబ్‌స్టేషన్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి 24 గంటల్లో సరఫరాను అందించినట్లు రాష్ట్ర ఇంధనవనరుల శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిత్లీ తుపానులో ఏర్పడిన విద్యుత్ సమస్యలను అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తిచేశామని గుర్తుచేశారు. పెథాయ్ తుపాను పునరుద్ధరణ పనుల్లో విద్యుత్‌శాఖ సిబ్బంది పై నుంచి కింది స్థాయి వరకు అహరహం శ్రమించారని అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుచూపు, ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా తుపాను గమనాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశామన్నారు. తిత్లీ తుపానులో 37వేల స్తంభాలు దెబ్బతిన్నాయని పదివేల మందితో పునరుద్ధరించ గలిగామని చెప్పారు. అదే స్ఫూర్తితో పెథాయ్ తుపానుకు ముందస్తుగా సామాగ్రి, యంత్రాంగాన్ని సిద్ధం చేశామన్నారు. జనరేటర్లు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. పెథాయ్ తుపాను వల్ల దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలను అమర్చామని, మరమ్మతులు కూడా నూరుశాతం పూర్తయినట్లు వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 425 గ్రామాల్లో సమస్యలు పరిష్కరించామని చెప్పారు. విశాఖలో 205, రాజమండ్రి పరిధిలో 215, ఏలూరులో 5 గ్రామాల్లో ఉత్పన్నమైన సమస్యలపై అధికారులు వెంటనే స్పందించారని తెలిపారు.