ఆంధ్రప్రదేశ్‌

నాగాయలంక చేరిన కాకినాడ మత్స్యకారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ కారణంగా సముద్రంలో గల్లంతైన కాకినాడకు చెందిన మత్స్యకారుల బోట్లలో ఒక బోటు మంగళవారం సాయంత్రం కృష్ణాజిల్లా నాగాయలంక తీరానికి చేరింది. 12 మందితో ప్రయాణిస్తున్న బోటు నాగాయలంక మండలం గుల్లలమోద లైట్ హౌస్ వద్ద కృష్ణానదిలో చిక్కుకుంది. ఆయిల్ అయిపోవటంతో బోటు ఎటూ కదలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బోటులో ఉన్న మత్స్యకారులు లంగరు వేశారు. అదే సమయంలో అటుగా వెళుతున్న నాగాయలంక ఎఫ్‌డీఓ ఈ బోటును గుర్తించి అందులో ఉన్న ఆరుగురిని తన బోటులో ఒడ్డుకు తీసుకు వచ్చి సొర్లగొందిలోని హాస్టల్‌లో వసతి కల్పించారు. మిగిలిన ఆరుగురిని కూడా ఒడ్డుకు తీసుకువచ్చేందుకు రెవెన్యూ, మెరైన్, పోలీసు అధికారులు ప్రయత్నాలు చేశారు. ఈ నెల 7వతేదీన కాకినాడకు చెందిన 12 మంది మత్స్యకారులు రెండు బోట్ల ద్వారా చేపల వేటకు వెళ్లారు. రెండు బోట్లలో ఒక బోటు కొట్టుకుపోయినట్టు మత్స్యకారులు చెబుతున్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నిజాంపట్నం వద్ద రెండు రోజులు ఆగిపోయిన మత్స్యకారులు తిరిగి మంగళవారం ఉదయం ఒక బోటులో సముద్రంలో వేటకు బయలుదేరినట్టు తెలుస్తోంది. గుల్లలమోద లైట్ సమీపంలోకి వచ్చే సరికి బోటులో డీజిల్ ఆయిపోవటంతో చేసేది లేక సొర్లగొంది పాయ ద్వారా ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ బోటు కృష్ణానది పాయలోనే ఆగిపోయిందని మత్స్యకారులు తెలిపారు.

చిత్రం..కృష్ణాజిల్లా సొర్లగొంది చేరుకున్న కాకినాడ మత్స్యకారులు