ఆంధ్రప్రదేశ్‌

‘హోదా’ను చట్టంలో చేర్చలేదే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు మద్దతు అడిగే ముందు విభజన చట్టంలో దాన్ని ఎందుకు పెట్టలేదో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు సమాధానం చెప్పాలని టిడిపి ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ విభజన విషయంలో ఎపికి అన్యాయం చేసిందని విమర్శించారు. హైకోర్టు విభజనకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన వెల్లడించారు. రాజధాని తరలింపునకు, హైకోర్టు విభజనకు సంబంధం లేదని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలుసహా అనేక సంస్థలు విభజనపై సమస్యలు ఉన్నాయని కింజరపు అన్నారు. జిఎస్‌టి బిల్లుకు పార్లమెంట్‌లో టిడిపి పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు
తప్పును సరిదిద్దుకోవడానికే ప్రైవేటు బిల్లు
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పును సరిదిద్దుకోవడానికే రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరరావు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టారని టిడిపి ఎంపీ టిజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలు కోరే ఏ బిల్లుకైనా టిడిపి మద్దతు ఇస్తుందని అన్నారు. ఏపీకి కాంగ్రెస్, బిజెపి ఏ పార్టీ న్యాయం చేసినా మాకు అభ్యంతరం లేదని, అయతే రాజ్యసభలో ప్రైవేటు బిల్లులు విజయవంతమయిన సంఘటనలు అరుదని అన్నారు.
ప్రత్యేక హోదాపై చర్చకు టిడిపి నోటీసు
ప్రత్యేక హోదాపై స్వల్పకాలిక చర్చకు టిడిపి లోక్‌సభ నాయకుడు తోట నర్సింహం స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు 193 నిబంధన కింద నోటీసు ఇచ్చారు.