ఆంధ్రప్రదేశ్‌

‘కొత్త ఆలోచనలకు ప్రోత్సాహకాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 9: స్టార్టప్‌లను, వినూత్నమైన ఆలోచనలను, నూతన పారిశ్రామిక విధానాలను ప్రోత్సహించేందుకు ఔత్సాహిక వ్యక్తులు, సంస్థల ద్వారా వచ్చే పరిష్కార మార్గాలకు తగిన ప్రోత్సాహకాలను అందిస్తామని ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ముఖ్య కార్య నిర్వహణాధికారి ఆర్‌ఎస్ విన్నిపాత్రో తెలిపారు. బుధవారం స్థానికంగా జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సోచ్, ఇజ్రాయేల్ టెల్ ఆవిహ హ్యాక్‌ధాన్ పరస్పర అవగాహనతో భారతదేశంలోను, ఇజ్రాయేల్ దేశంలోను ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి నూతన ఆవిష్కరణలను ఆహ్వానిస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయేల్ వినూత్నమైన ఆలోచనలకు ప్రసిద్ధిగాచిందని, ఆ దేశంలో రూపొందించిన వివిధ ఆవిష్కారాలను ఎన్నో దేశాలకు అందిస్తోందన్నారు. ఆ దిశలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సోచ్ విభాగం ఆధ్వర్యంలో ఇజ్రాయేల్‌తో గత ఆరు నెలలుగా సంప్రదింపులు చేస్తున్నామన్నారు. ఇజ్రాయేల్ ప్రాంతంలో చూపిస్తున్న పరిష్కారాల దృక్పథంలో ఆలోచనలు చాలా బాగున్నాయన్నారు. ఇందుకోసం పరస్పరం ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకునే విధానంలో ఆయా ఆలోచనలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఒక లక్షా, 30వేల అమెరికన్ డాలర్ల బహుమతులను అందించాలని నిర్ణయించామన్నారు. ఇందులో సగం భారతదేశం నుంచి వచ్చే ఆలోచనలకు, మరో సగం ఇజ్రాయేల్ దేశం నుంచి వచ్చే ఆలోచనలకు అందిస్తామన్నారు. ఆయా వినూత్నమైన ఆలోచనలకు, పరిష్కారమార్గాలకు మూడు విడతలుగా నగదు పరిష్కారాలకు ఎంపిక చేస్తామన్నారు. డీసీఎఫ్ వెంచర్స్ సీఈవో లక్ష్మీ పోట్లూరి మాట్లాడుతూ ఇరు దేశాలు ఉత్తమ ఆలోచనలకు చక్కని పరిష్కారం చూపాలనే విధానంలో అవగాహనతో మందుకు వెళుతున్నామన్నారు. సైబర్ సెక్యూరిటీ పైనా వినూత్నమైన ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అసోసియేటెడ్ డైరెక్టర్ వినుత పాల్గొన్నారు.