ఆంధ్రప్రదేశ్‌

సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 9: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని, ఇందుకు ప్రతి నేత తమ తమ పరిధిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ఓ పక్క టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, మరో పక్క ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తాజాగా పార్లమెంటులో ఆమోదం పొందిన అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ల కేటాయింపు అంశాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి పార్టీ పట్ల జనం ఆకర్షితులయ్యేలా చూడాలన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లేందుకు శ్రేణులను సన్నద్ధం చేయాలని సూచించారు. చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, రాష్ట్రప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో రాష్ట్భ్రావృద్ధి కోసం విభజన చట్టంలో పొందుపర్చిన అంశాల అమలుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని, విడుదల చేస్తున్న నిధుల వివరాలను ప్రజలకు తెలియజేయాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. కాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన మేడసాని పురుషోత్తం నాయుడు, పాకాల మండలానికి సంబంధించిన మేడసాని మనోహర్ చౌదరి ఇరువురూ కన్నా సమక్షంలో బీజేపీలో చేరారు. మేడసాని పురుషోత్తమ నాయుడు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఓడించిన వెంకట్రామనాయుడికి స్వయాన సోదరుడి కుమారుడు కావడం గమనార్హం. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జిలు సతీష్‌జీ, సునీల్ దియోదార్, నేతలు పురంధరేశ్వరి, మాణిక్యాలరావు, సోము వీర్రాజు, సురేష్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, తిరుపతి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల సతీష్‌కుమార్, సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.
1 నుంచి బస్సుయాత్ర
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బీజేపీ నేతల బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. శ్రీకాకుళం నుంచి యాత్ర ప్రారంభిస్తామని పార్టీ నేతలు తెలిపారు. అదే విధంగా ఈ నెల 18న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కడపకు రానున్నట్లు తెలిపారు.
చిత్రం..కన్నా సమక్షంలో బీజేపీలో చేరిన చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు