ఆంధ్రప్రదేశ్‌

పారదర్శకతతో పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఆదాయంలో 72 శాతం వాణిజ్య పన్నుల శాఖ ద్వారానే వస్తోందని, ఏ శాఖలోనైనా నీతి, నిజాయితీతో పనిచేసే అధికారులకు ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తోందని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. వాణిజ్య పన్నుల క్షేత్ర స్థాయి అధికారులతో నిర్వహించే రెండు రోజుల సమీక్ష కార్యక్రమంలో మంగళవారం తొలిరోజు ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 53 వేల కోట్ల మేర రెవెన్యూ ఆదాయం ఎక్సైజ్, వాణిజ్య, రవాణా తదితర శాఖల ద్వారా వస్తోందని ఆ మొత్తం రూ.34 వేల కోట్లు కేవలం వాణిజ్య పన్నుల శాఖ ద్వారానే వస్తోందని అన్నారు. పన్నుల వసూళ్లలో ఎటువంటి మినహాయింపులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సహాయకారిగా ఉండి, జవాబుదారీతనంతో కూడి పారదర్శకంగా అధికారిక విధులను నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా మరింతగా ఆదాయాన్ని పెంచేందుకు నిజాయితీతో కూడిన పనితీరు ఆశిస్తున్నామన్నారు. గత ఏడాది వృద్ధి రేటు సాధించడంలో వాణిజ్య శాఖ అధికారుల పనితీరును ప్రత్యేకంగా అభినందిస్తున్నారని హర్షధ్వానాల మధ్య మంత్రి ప్రకటించారు. పారదర్శకతతో కూడి అవినీతి లేకుండా డీలర్లకు, వ్యాపార నిర్వాహకులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడి మరింత మేలైన సేవలను అందించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటులో గణనీయమైన ప్రగతి చూపినందున అందుకు ప్రతిఫలంగా 78 వాహనాలను కొత్తగా వాణిజ్య శాఖాధికారులకు అందిస్తున్నామని అదే విధంగా 350 వాహనాలను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. టోల్‌టాక్స్ ద్వారా, రవాణా సరుకుల ద్వారా జరిగే వ్యాపారాలకు సంబంధించిన పన్నులను సక్రమంగా చెల్లించాలని వ్యాపారులకు, డీలర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుండి రాయితీలను ఆశించే నేపథ్యంలో ముందుగా వారు సక్రమంగా చెల్లించాల్సిన పన్నులను చెల్లించాలని కోరారు. పన్నుల రాయితీలో ఎటువంటి మినహాయింపు ఉండదని అక్రమ మార్గాల ద్వారా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఆదాయానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వ్యక్తుల, సంస్థలపై అపరాధ రుసుం వెయ్యడం జరుగుతుందన్నారు. బదిలీలు తదితర అంశాల్లో పనితీరునే ప్రామాణికంగా తీసుకుంటామని ఇందులో సిఫార్స్‌కు ఎటువంటి మినహాయింపు ఉండదన్నారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ జె.శ్యామలరావు మాట్లాడుతూ ఇప్పటికే ఆన్‌లైన్ సేవా విధానంలో వాణిజ్య పన్నుల శాఖ మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయని మరింతగా పారదర్శకతతో కూడిన పాలనను అందించాల్సి ఉందన్నారు. శాఖ పరిధిలో జరిగే ప్రతి ఒక్క లావాదేవీని ఆన్‌లైన్ విధానంలో మాత్రమే నమోదు చెయ్యాలని ఇన్‌వాయిస్ రికార్డులను సక్రమ నిర్వహణ బాధ్యతలను అధికారులు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో వ్యాపారులు, డీలర్లు నమోదు చేయడం లేదని ఇతరులపై అపవాదు వేసే సమయంలో అధికారుల పాత్రను కూడా సరిచూసుకోవాలన్నారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ స్థాయి నుండి సహాయ వాణిజ్య పన్నుల అధికారి వరకు వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న 1200 మంది సిబ్బంది పాల్గొన్నారు. అడిషనల్ కమిషనర్లు పంపావతి, జి.వెంకటేశ్వర్లు, జాయింట్ కమిషనర్ యు.ఏడుకొండలు, ఒఎస్‌డి డివి రావు, అదనపు కమిషనర్ టి.రమేష్‌బాబు, సెక్రటరి టు కమిషనర్ నాగరాణి తదితరులు పాల్గొన్నారు.