ఆంధ్రప్రదేశ్‌

గ్రామీణ పేదరికం నిర్మూలనే ధ్యేయంగా సెర్ప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 11: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా నిరంతరం పేదల అభ్యున్నతికి సెర్ప్ పనిచేస్తోందని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి కృష్ణమొహన్ తెలిపారు. పేదల జీవనోపాధులను ప్రోత్సహించటానికి తోడ్పడుతున్నదని, ఈ క్రమంలో సంఘ సభ్యులు తయారు చేసిన ఆహార ఉత్పత్తులు, చేతివృత్తులు, హస్తకళలు, చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తోందన్నారు. ఆయా ఉత్పత్తులకు మార్కెటింగ్, ప్రచారం కల్పించే దిశలో డ్వాక్రా బజార్‌లను క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఆయా ప్రదర్శనల్లో సంఘ సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కలిపిస్తూ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా సెర్ప్ నిలుస్తున్నదన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పెద్ద నగరాలైన విజయవాడ, విశాఖపట్నంల్లో పెద్దఎత్తున డ్వాక్రాబజార్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ డ్వాక్రాబజార్‌ల్లో 400 స్టాల్స్ ఏర్పాటు చేసి పెద్దఎత్తున డ్వాక్రా మహిళలకు అవకాశాలు కలిగించటం ద్వారా సంఘ సభ్యుల ఉన్నతికి సెర్ప్ కృషి చేస్తోందన్నారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు ఆన్‌లైన్ మార్కెటింగ్ కోసం ఈ-మహిళ బ్రాండ్‌తో అవకాశం కల్పిస్తున్నామన్నారు.