ఆంధ్రప్రదేశ్‌

విభజన చట్టంలో భాగంగానే హైకోర్టు బెంచ్ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 11: విభజన చట్టంలో భాగంగానే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యమని న్యాయవాదులు అంటున్నారు. బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకువచ్చినందున ఇక శాసనసభ తీర్మానం, గవర్నర్ ఆమోదం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకటనే తరువాయి అని పేర్కొంటున్నారు. బెంచ్ ఏర్పాటుకు అవసరమైన భవనం, వౌలిక వసతులు కర్నూలులో సిద్ధంగా ఉన్నందున ఎన్నికల లోపు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించడం పట్ల అటు న్యాయవాదులు, ఇటు కక్షిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తే హైకోర్టు పనుల కోసం ప్రజలు అమరావతికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కర్నూలులోనే ఆయా కేసులను పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చని వారంటున్నారు. దీనివల్ల ప్రజలకు వ్యయ, ప్రయాసలు తగ్గడమే కాకుండా కేసుల పరిష్కారం త్వరితగతిన పూర్తవుతుందని స్పష్టం చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటైతే న్యాయవాదులు సైతం లబ్ధిపొందుతారని వెల్లడిస్తున్నారు. సీమ జిల్లాలకు సంబంధించి అనేక కేసులు హైకోర్టుకు వెళ్లాల్సి వస్తే గతంలో హైదరాబాద్‌లోని సీనియర్ న్యాయవాదులకు సిఫారసు చేసి కక్షిదారులను అక్కడికి పంపేవారు. తాజాగా అమరావతిలో రాష్ట్ర హైకోర్టు ప్రారంభం కావడంతో కక్షిదారులు అమరావతికి వెళ్లి అక్కడి న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. ఈ తరుణంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటైతే రాయలసీమ జిల్లాలకు చెందిన వారు కర్నూలులోనే కేసుల పరిష్కారం కోసం ప్రయత్నించే వెసులుబాటు ఉంటుంది.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రభుత్వ ఇష్టప్రకారం జరగదని, హైకోర్టు, సుప్రీం కోర్టు అంగీకారంతోనే అది సాధ్యమని కొందరు వాదిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే విభజన చట్టం ప్రకారం సాధ్యమేనని మరి కొందరు పేర్కొంటున్నారు. దీనిపై కర్నూలు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చాంద్‌బాషా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టం 2014లో సెక్షన్-31(3) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గం ఆమోదించి ఆ తరువాత శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుందన్నారు. ఆ నివేదికను రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నివేదికను పరిశీలించి హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపితే దాని ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదుపరి చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. విభజన చట్టంలో ఉన్న అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుని హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్ నుంచి ఆమోదం పొందడమే ప్రధాన అంశమని ఆయన అన్నారు. ఆ తదుపరి ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని స్పష్టం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకు అవసరమైన భవనం కూడా సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న మున్సిఫ్ కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన 5 అంతస్థుల భవనం హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు తరువాత ప్రభుత్వం అవసరమనుకుంటే మరోచోట కొత్త భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టవచ్చని తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వ అంగీకరించినందున శాసనసభలో తీర్మానం, గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉందన్నారు.
వీటిని కూడా ఎన్నికలలోపు పూర్తి చేసి కర్నూలులో హైకోర్టు బెంచ్ ప్రారంభించాలని ఆయన సీఎం చంద్రబాబును కోరారు.