ఆంధ్రప్రదేశ్‌

పందెం కోళ్లు బరిలోకి దిగాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, జనవరి 11: పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంప్రదాయం పేరిట జరిగే కోడి పందేలు ఈ ఏడాదీ షరా మామూలే అనే సంకేతాలు శుక్రవారం వెలువడ్డాయి. అధికార తెలుగుదేశం పార్టీ నరసాపురం నియోజకవర్గ కన్వీనర్, ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న కనుమూరి రఘురామకృష్ణంరాజు శుక్రవారం లాంఛనంగా కోడి పందేలను ప్రారంభించడమే ఇందుకు సంకేతంగా చెప్పవచ్చు. అలాగే సంకాంత్రి సంప్రదాయాల్లో కోడి పందేలు భాగమని, వాటిని ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయరంటూ జిల్లాలోని వీరవాసరం మండలంలో జరిగిన జన్మభూమి సభ సాక్షిగా ఆయన ప్రకటించేశారు. ఏటా రఘురామకృష్ణంరాజు ఇదే తరహాలో పండుగకు కొద్ది రోజుల ముందు కోడి పందేలను ప్రారంభించడం, తదనంతరం పండుగ సీజను మూడు రోజులు భారీగా పందేల జాతర జరగడం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. దీనితో ఈ ఏడాదీ షరామాములుగా పందేల జాతర ఖాయమనే ధీమా నిర్వాహకులు, పందేలరాయుళ్లలో వ్యక్తమవుతోంది.
వివరాల్లోకి వెళితే... ఆరో విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నందమూరిగర్వు గ్రామంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ కన్వీనర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు స్వయంగా కోడి పుంజును చేతపట్టుకుని కోడి పందెం వేశారు. ఈ సందర్భంగా తెలుగువారి సంస్కృతీ, సంప్రదాయాల్లో భాగమే కోడి పందాలని ఆయన పేర్కొన్నారు. కోడి పుంజులకు కత్తులు కట్టకుండా పందేలు నిర్వహించుకోవచ్చునన్నారు. ఇది తెలుగువారి సాంప్రదాయంలో ఒక భాగమేనన్నారు. రఘురామకృష్ణంరాజు ఈ పోటీలను ప్రారంభించటంతో అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజు పందాలు నిర్వహిస్తున్నట్టు మండలంలోని ప్రజలకు సమాచారం అందడంతో పెద్దసంఖ్యలో అక్కడకు తరలిరావడం విశేషం. అనంతరం జరిగిన జన్మభూమి సభలో సైతం ఆయన ఇదే వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు ఎంతో ఉత్సాహంగా చేసుకునే పండుగల్లో ప్రభుత్వం కానీ, ఇతరుల జోక్యం కానీ ఎప్పుడూ ఉండదని, సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయకంగా నిర్వహించుకునే భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల నృత్యాలు, కోడి పందాలు తదితర వాటితో ప్రజలంతా సంతోషంగా ఉంటారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
అయితే గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు, తహసీల్దార్లు సంక్రాంతి పేరిట నిర్వహించే కోడిపందేలు, జూదాలు జరగనివ్వబోమని ప్రకటనలు చేస్తున్నారు. ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తున్నారు. పందేల నిర్వహణకు ఏర్పాటుచేస్తున్న బరులను ధ్వంసం చేయిస్తున్నారు. దీనితో పందేల నిర్వహణపై ఇప్పటివరకు కొంతమేర సందేహాలున్నా, శుక్రవారం నాటి లాంఛనంతో అందరిలో ఆ భ్రమలు తొలగిపోయాయి. ఏటా మాదిరిగానే ఆ మూడు రోజులు వచ్చే వౌఖిక ఆదేశాలతో అధికారులంతా వౌనవ్రతం పాటిస్తారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.