ఆంధ్రప్రదేశ్‌

జగన్‌తో భక్తులకు ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 11: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన జగన్ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో తన కార్యకర్తలతో అత్యుత్సాహాన్ని అహంకారాన్ని ప్రదర్శించారని, స్వామివారి సన్నిధిలో ఉన్నామనే ఇంగితాన్ని మరిచి అనుచరులతో జై కొట్టించుకోవడం జగన్ వంటి వారికే చెల్లిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ ఆక్షేపించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో ఆమె శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ పాదయాత్ర పేరుతో, రోజుకో విధంగా ప్రవర్తిస్తూ ఇన్నాళ్ళూ రాష్ట్ర ప్రజలను ఏడిపించిన జగన్, వెంకన్న దర్శనానికి వెళ్లి అక్కడున్న భక్తులను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. భగవంతుడి దర్శనానికి వెళ్లిన వారు, ప్రశాంత చిత్తంతో... పరమాత్ముడిపై ప్రేమతో వ్యవహరిస్తారని, అందుకు విరుద్ధంగా జగన్, ఆయన అనుచరగణం స్వామివారి ప్రాంగణంలో తలబిరుసుతో ప్రవర్తించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా స్వామివారి దర్శనానికి వెళ్లిన జగన్ డిక్లరేషన్‌లో సంతకం చేయకుండా ఆలయ ప్రతిష్టను మంటగలిపారన్నారు. మితిమీరిన అహంకారంతో ప్రవర్తించే జగన్‌కు ఎప్పటికీ అధికారం దక్కదని, ఎన్ని జన్మలెత్తినా, ఎందరు దేవుళ్లకు మొక్కినా ఆయన చేసిన అవినీతి మాసిపోదని ఆమె ఎద్దేవా చేశారు. వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి తిరుమల్లో జగన్‌పై ఏదో కుట్ర జరుగుతోందంటూ అలజడి సృష్టించాలని ప్రయత్నించారన్నారు. వాస్తవానికి నిన్న వైసీపీ కార్యకర్తలు, కరుణాకర్‌రెడ్డి వంటి నేతలు దర్శనం పేరుతో రాజకీయాలు చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కొత్త కుట్రలు లేపడానికి ప్రయత్నించారని ఆమె పేర్కొన్నారు.
మనసులో ఒకటి ఉంచుకొని, పైకి వేషాలు మార్చి నటిస్తూ మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్న జగన్ ఆయన అనుచరులకు ఆ ఏడుకొండలస్వామే తగిన శాస్తి చేస్తాడన్నారు.