ఆంధ్రప్రదేశ్‌

‘తొలి జాబితా’పై కోటి ఆశలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 11: రాష్ట్ర రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీలు ప్రకటించే తొలి జాబితాలపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైవుంది. ఈ రెండు పార్టీలతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీతో పాటు జనసేన పార్టీల్లో కూడా తొలి జాబితాపై చర్చ జరుగుతోంది.
ఇప్పటికే జనవరి మాసం సగం పూర్తికానుండటం, ఆపై ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల నేతలకు టిక్కెట్ ఫీవర్ పట్టుకుంది. ఒకపక్క అభ్యర్ధుల జాబితాలను సిద్ధంచేయడానికి పార్టీల అధిష్ఠానాలు కసరత్తు చేస్తుండగా మరో పక్క ఆశావహుల్లో మరింత టెన్షన్ పెరుగుతోంది. తొలి జాబితాలో పేరు ఖరారైతే ప్రచారానికి ఎక్కువ సమయం ఉంటుందనేది ఆశావహుల భావన. దీనితో తొలి జాబితాలోనే పేరుండాలని ఆశావహులు మొక్కుకుంటున్నారు.
రాష్ట్రంలో టీడీపీతో పొత్తు అంశం ఈనెల 20న తేలుతుందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు, రాహుల్ మధ్య పొత్తు అంశంపై చర్చలు జరిగివుండవచ్చనే వాదన వినిపిస్తోంది. ఈ అంశంపై క్లారిటీ కోసం చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. జనవరి 3వ వారంలో తొలి జాబితాను ప్రకటిస్తానని , ఫిబ్రవరి మొదటి వారంలో రెండో జాబితాను, మార్చి మొదటి వారానికి మూడో జాబితాను ప్రకటిస్తామని చంద్రబాబు పార్టీ శ్రేణులకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంకేతాలిచ్చారు. తొలి జాబితాలో ఒక్కో జిల్లాకు 3 నుంచి 5 అసెంబ్లీ స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఖాయంగా గెలిచే సీట్లను ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు.
ఇక వైసీపీ కూడా భారీఎత్తున పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్ధులపై కసరత్తు చేస్తోంది. అసెంబ్లీలతో పాటు పార్లమెంట్ అభ్యర్ధులను కూడా ఒకేసారి ప్రకటిస్తారని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రథమ ప్రాధాన్యతగా పార్టీ మారకుండా ఉన్న సిట్టింగ్‌లకు లోక్‌సభ, శాసనసభ సీట్లను ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీలో ఉన్న సిట్టింగ్‌లు మాత్రం తమకే మరోసారి బి-్ఫరం లభిస్తోందని చాలా ధీమాగా ఉన్నారు. ఇక మరో పార్టీ జనసేన నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకుని అభ్యర్ధుల కోసం వేటాడుతోంది. అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా సమావేశాలు అమరావతిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ నిర్వహించిన సభలకు, కవాతులకు ఉత్సాహంగా పాల్గొన్న వారిని అభ్యర్ధులుగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక భారతీయ జనతా పార్టీ ఇప్పటికే కొంత మంది అభ్యర్ధులతో జాబితాను సిద్దం చేసుకుని, క్షేత్ర స్ధాయిలో సర్వే చేపట్టినట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ దూతలు రాష్ట్రంలోనే మకాంవేశారు. వీరు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటించి, అక్కడ స్థితిగతులను, ఉత్సాహంగా ఉన్నవారి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో తొలి జాబితా వ్యవహారం జోరుగా సాగుతోంది.