ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ హోదా ఇవ్వకుంటే రాష్ట్రంలో అడుగుపెట్టను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జనవరి 11: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్‌గాంధీ ప్రధాని అయిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రంలో అడుగు పెట్టనని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి శపథం చేశారు. ప్రత్యేక హోదా ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా హిందూపురం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీని కలిసి 30 అంశాలపై చర్చించానన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం కీలకమయిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. మూడు ప్రాంతీయ పార్టీలు రాష్ట్భ్రావృద్ధిని దృష్టిలో పెట్టుకుని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పోటీ చేస్తే రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేసినట్లు అవుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రం చేతుల్లోనే ఉంటుందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పిందన్నారు. కాబట్టి కాంగ్రెస్ ఒక్కటే దిక్కన్నారు. రాష్ట్రంలో టీడీపీతో పొత్తుపై అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు కోటా సత్యం, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలాజీమనోహర్, నాయకులు ఆదిమూర్తి, శైవలి రాజశేఖర్, నాగరాజుయాదవ్, నాగరాజు, రహమత్ తదితరులు పాల్గొన్నారు.