ఆంధ్రప్రదేశ్‌

కులాల పునాదులపైనే భారతీయ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జనవరి 11: కులాల పునాదులపైనే భారతీయ వ్యవస్థ నిర్మితమైందని, అయితే వ్యవస్థను నడిపే వారికి కుల పట్టింపు ఉండకూడదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజాబలం లేని పార్టీలకి నిర్మాణం ఉన్నా ఉపయోగం ఉండదు, అలాగే జనబలం ఉన్న పార్టీ నిర్మాణానికి ఎంతో సమయం పట్టదన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లాల వారీ సమీక్షలో భాగంగా శుక్రవారం ఆయన పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పార్టీ కో ఆర్డినేటర్లు, నేతలు, శ్రేణులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి రాజకీయ వ్యవస్థలో రోజు రోజుకి అవినీతి పెరిగిపోతోందన్నారు. నాడు టీడీపీ తక్కువ అవినీతితో పాలిస్తుందని ఆశించానన్నారు. నేడు ఆ పార్టీ కూడా అంచనాలకు మించిపోయి అవినీతిలో మునిగిపోయిందన్నారు. చట్టాలను తమకు అనుకూలంగా మలుచుకొని రాజకీయపార్టీలు వాడేసుకుంటున్నాయన్నారు. దెందులూరు నియోజకవర్గంలో కొందరు దళితులపై జరుగుతున్న వేధింపులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. అటువంటి వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. జనసేన పార్టీ సమాజ వికాసం కోసం మాత్రమే పని చేస్తుందని, కులం పేరుతో ప్రజలను విడగొట్టబోదన్నారు. కులాన్ని నమ్ముకున్న కొన్ని పార్టీలు కొద్ది కాలం మాత్రమే ప్రయోజనం పొందుతాయని, ఆ తరువాత అవి నిర్వీర్యం అయిపోతాయన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గంలను నమ్ముకుని తాను పార్టీని ఏర్పాటు చేయలేదని, మానవత్వం కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. కుల వ్యవస్థ బలంగా ఉన్న మన వ్యవస్థలో కులాల ఆలోచనలు, కులాల మధ్య ఘర్షణలు అధిగమించకపోతే సామాజిక వినాశనం తప్పదన్నారు. తాను ఇంటర్‌లోనే చదువు ఆపేసినా చదవడం మాత్రం ఆపలేదన్నారు. రోజుకు కనీసం 8 గంటలు అన్ని విషయాలకు సంబంధించిన పుస్తకాలు చదువుతూనే ఉంటానన్నారు. ప్రజా సంక్షేమం కోసం తాను ఎవరితో గొడవపెట్టుకోవడానికైనా సిద్ధమేనన్నారు. విభజించు పాలించు అనే సిద్ధాంతం ఏ రూపంలో ఉన్నా తాను వ్యతిరేకిస్తానన్నారు. అనుకున్న భావజాలం ప్రజల్లోకి వెళ్లాలంటే కనీసం రెండు దశాబ్దాల సమయం పడుతుందని, గత అనుభవాలు ఇదే విషయం స్పష్టం చేశాయన్నారు. అందుకే తాను 25 ఏళ్ల పాటు పనిచేసేందుకు, పోరాటం చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాక తిట్టేవారు సైతం ఉంటారు, మనల్ని అభిమానించే వారికి విమర్శించే హక్కు కూడా ఉంటుందన్నారు. ప్రజాజీవితంలో ఇష్ట మోచ్చినట్లు మాట్లాడితే ప్రజల మన్నన కోల్పోతామన్నారు. రాజకీయాల్లో నిలబడాలంటే గుండె ధైర్యం ఉండాలని పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యవస్థని వాడుకొని వ్యక్తులు బలపడుతూ వ్యవస్థని నాశనం చేస్తూ, వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతున్నారని అభిప్రాయపడ్డారు. పార్టీ ఏర్పాటుకు ముందు ప్రజల కష్టాలను తెలుసుకున్నానన్నారు. 25 కేజీల బియ్యం వద్దు, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్న మాట క్షేత్ర స్థాయిలో వినిపిస్తోందన్నారు. 2009లో పీఆర్పీ వైఫల్యం నేర్పిన పాఠం రాష్ట్ర విభజన తర్వాత వ్యవస్థలో మార్పు కోసం నిలబడేలా చేసిందన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడుతుంటే, అందరినీ అవమానిస్తుంటే ఏ ఒక్కరూ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. రాజకీయ పార్టీ నడిపేందుకు కోట్ల రూపాయలు అవసరం లేదన్న ఆయన ఆశయాలు, భావజాలం బలంగా ఉంటే చాలన్నారు. ఉద్యమాలతోనే పార్టీ బలోపేతం కావాలిగానీ, కులాలతో మొదలు పెడితే ఎక్కువ కలం మనుగడ సాగడం కష్టమన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల మధ్య సంభాషణలు మొత్తం దోచుకోవడం అనే అంశం మీదే సాగుతున్నాయన్నారు. వాళ్లు ఎంత తిన్నారు, మనం వస్తే ఇంకా ఎంత బాగా తినొచ్చు అనే అంశాల మీద చర్చించుకుంటున్నారని తెలిపారు. పార్టీలోకి కొత్త నాయకులు రావచ్చు, వారి వర్గం వారు రావొచ్చు.. కానీ ముందు నుంచి పని చేస్తున్న జనసైనికులే పార్టీకి వెనె్నముక వంటి వారన్నారు. వారిని పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుందన్నారు. నాయకులు నన్ను నమ్మి వస్తున్నారు, ఇదే సమయంలో తనపై ఉన్న నమ్మకం జనసైనికుల మీద ఉండకపోవచ్చు అంటూ దీనికి సమయం పడుతుందని, ఓపికతో ఎదురు చూడాలన్నారు. బలమైన వ్యవస్థను నిర్మించేందుకు తానే స్వయంగా, ఒక్కో అడుగు నిర్మించుకుంటున్నట్లు తెలిపారు. వారసత్వ రాజకీయాలను మాత్రం తాను వెంటతెచ్చుకోలేదన్నారు. రాజధాని అభివృద్ధి అంటే లక్ష కోట్ల రూపాయల వ్యవహారం అన్నారు. అటువంటి సమయంలో అభివృద్ధిని సమానంగా పంచరు, మనం అడగాలి, పోరాటం చేసి సాధించుకోవాలన్నారు. బలమైన వ్యక్తుల సమూహం ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ వివరించారు.