ఆంధ్రప్రదేశ్‌

22-ఏ నుంచి తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 13: విశాఖపట్నం జిల్లా గాజువాక పట్టణ పరిధిలో సిద్ధార్థనగర్ (జీవీఎంసీ 53 వార్డు పరిధి) 1/5 సర్వే నెంబర్‌లో ఉన్న ప్రాంతాన్ని 22-ఏ పరిధి నుంచి తొలగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు. 1989లో రాష్ట్ర ప్రభుత్వం బీహెచ్‌పీవీ ఎంప్లారుూస్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాల కోసం స్థలాలు కేటాయించిందన్నారు. ప్రభుత్వం ఆదేశించిన రేటు ప్రకారం మొత్తం 9 ఎకరాల భూమికి సభ్యులు డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఉడా అనుమతి కూడా పొందారని, జీవీఎంసీ కూడా ఇంటి ప్లానులు మంజూరు చేశారన్నారు. ఇలా మొత్తం 272 ఇళ్లు నిర్మించుకుని 30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారన్నారు. అయితే 1/5 సర్వే నెంబర్‌ను 22-ఏ పరిధిలోకి తీసుకొచ్చి భూ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేశారని, ఇది చట్టవిరుద్ధమని నిరసన తెలిపారు. దీనివల్ల సిద్ధార్థనగర్‌లోని 272 కుటుంబాలు బ్యాంకుల నుండి రుణాలు పొందడానికి వీలుకావడం లేదన్నారు. కాగా, మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలో 52వ వార్డు పెదగంట్యాడ ప్రాంతంలో బాలచెరువు మీసేవ కేంద్రం గ్రౌండ్‌లో డ్రై రిసోర్స్ సెంటర్ (డంపింగ్ యార్డ్) ఏర్పాటు చేయాలనే జీవీఎంసీ నిర్ణయాన్ని ఉపసంహరింపచేయాలని మరో లేఖలో మధు కోరారు. ప్రజల అవాసాల మధ్య ఈ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నారని, దీనివల్ల 20వేల ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందన్నారు. దీనికి వ్యతిరేకంగా సీకువానిపాలెం, పెదకోరాడ, చినకోరాడ, బాలచెరువు ప్రాంతం, పెడగంట్యాడ ప్రజలు పెద్దసంఖ్యలో గత రెండు వారాల నుండి తీవ్ర పోరాటం చేస్తున్నారని, రాత్రింబవళ్లు అక్కడే ఉండి నిరసన తెలుపుతున్నారన్నారు. డ్రై రిసోర్స్ సెంటర్ పేర చెత్తాచెదారం, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, కాగితాలు, ఇలా రకరకాల వ్యర్థాలు ప్రజల ఆవాసాల మధ్యకు తరలించడం చట్టవ్యతిరేకమని మధు స్పష్టం చేశారు.