ఆంధ్రప్రదేశ్‌

తెలుగు వారికి మంత్రి లోకేష్ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 13: తెలుగు వారందరికీ సంక్రాంతి పండుగతో ఏడాది మొత్తం శుభాలు కలగాలని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ప్రతి ఇంటా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకోవాలని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో అభిలషించారు. పల్లెల్లో ప్రగతి కాంతులీనుతున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమాలు నిండుగా ప్రతి ఇంటా బాసటగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రతి ఇంటికీ పెద్దకొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసరాగా నిలిచారని, పింఛనుదార్లకు ప్రభుత్వం భరోసా ఇచ్చిందని మంత్రి లోకేష్ గుర్తుచేశారు.