ఆంధ్రప్రదేశ్‌

ప్రతి ఒక్కరూ కష్టపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, జనవరి 13: ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేసి, సంపద సృష్టించి మన దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి సూచించారు. సంక్రాంతి సంబరాలకు గాను శనివారం స్వగ్రామానికి చేరుకున్న భువనేశ్వరి ఆదివారం నారావారిపల్లి గ్రామంలో పలు కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు, స్థానికులతో కలసి పాల్గొన్నారు. స్విమ్స్ నిర్వహించిన వైద్యశిబిరాన్ని భువనేశ్వరి ప్రారంభించారు. మహిళలకు చికిత్స కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ బస్సులో ఉన్న వైద్య సౌకర్యాలను స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ వివరించారు. స్థానిక కల్యాణ మండపంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను, అంగన్‌వాడీలో అందిస్తున్న పౌష్టికాహారం స్టాల్స్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ పౌష్టికాహారాన్ని రుచి చూశారు. టీటీడీ కల్యాణ మండపంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని గ్రామీణ సంప్రదాయ క్రీడలను వీక్షించారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కష్టపడి సంపద సృష్టించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. గత 9 సంవత్సరాలుగా స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి జరుపుకుంటున్నామన్నారు. తమ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రజలు తమ సొంత ఊళ్లకెళ్లి పెద్దలు, గ్రామస్థులతో సంక్రాంతి జరుపుకోవాలన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. భువనేశ్వరి సమక్షంలో నిర్వహించిన రంగవల్లుల పోటీల్లో గెలుపొందిన వారికి భువనేశ్వరి, బ్రాహ్మిణి, దేవాన్ష్‌లు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, నారా ఇందిర, నారా లోకేశ్వరి, తేజశ్విని, భరత్, స్థానికులు, పరిసర గ్రామస్థులు, పాఠశాల వి ద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చిత్రం..నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ పౌష్టికాహారాన్ని
మనవడు దేవాన్ష్‌కు తినిపిస్తున్న సీఎం సతీమణి నారా భువనేశ్వరి