ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ సభ్యత్వం @ 65 లక్షలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 13: సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ రికార్డు సృష్టించింది. 2018-20 సంవత్సరాలకు సంబంధించి గత ఏడాది నవంబర్ ఒకటి నుంచి ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో 65లక్షల 29వేలకు పైచిలుకు టీడీపీ సభ్యత్వం పొందారు. 2016-18లో 64లక్షల 42వేల సభ్యత్వాలతో పార్టీ ముందుంది. జిల్లాల వారీగా గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, చిత్తూరు, తూర్పుగోదావరి మొదటి ఐదుస్థానాల్లో నిలిస్తే నియోజకవర్గాల వారీగా పాలకొల్లు, కుప్పం, ఉదయగిరి, ఆత్మకూరు, మైలవరం వరుస స్థానాల్లో ఉన్నాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గత రెండు నెలలుగా క్షేత్రస్థాయిలో పనిచేసి రికార్డు సృష్టించిన కార్యకర్తలు, నాయకులను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. కార్యకర్తల సంక్షేమానికి ఓ విభాగం ఏర్పాటు చేసిన ఏకైక పార్టీగా టీడీపీ నిలిచిందన్నారు. రూ. 100 సభ్యత్వంతో కార్యకర్తలు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 4178 మంది కార్యకర్తలకు రూ. 14కోట్ల మేర ఆర్థిక సాయం అందించామని తెలిపారు. ప్రమాదాల్లో మరణించిన 3031 మంది కార్యకర్తల కుటుంబాలకు బీమా కింద రూ 60.62 కోట్ల ప్రయోజనం కల్పించారు. ప్రమాదాల్లో గాయపడిన 89 మంది కార్యకర్తలకు రూ 52.80 లక్షలు అందించారు. 815 మంది విద్యార్థులకు రూ 2.28 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందిందని మంత్రి లోకేష్ తెలిపారు. టీడీపీ సభ్యత్వం అంటేనే ఒక గౌరవమన్నారు. సేవాభావం, అంకితభావం కలిగిన సుశిక్షితులైన సైనికుల్లాంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సొంతమన్నారు. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఆవిర్భవించిన పార్టీ అదే విధానాలను కొనసాగిస్తోందని చెప్పారు. 2018-20 సంవత్సరానికి గతేడాది అక్టోబర్ 31న ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకున్నారని గుర్తుచేశారు. సభ్యత్వ నమోదుకు 3వేల మంది క్షేత్రస్థాయిలో పనిచేశారని తెలిపారు. అత్యంత పారదర్శకంగా అధునాతన సాంకేతిక పద్ధతుల్లో సభ్యత్వ నమోదు జరిగిందన్నారు. సభ్యత్వం పొందిన దగ్గర నుంచి కార్యకర్తలకు గుర్తింపు కార్డులు మంజూరు చేసేవరకు ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ పనిచేస్తోందని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు అందరినీ సమన్వయ పరిచేందుకు 24గంటలూ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. కార్యకర్తలకు శిక్షణ తరగతులు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీ రామారావు పార్టీని స్థాపించిన నాటి నుంచి అందుకు కొనసాగింపుగా ఆయన ఆశయాల సాధనకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని లోకేష్ ప్రస్తుతించారు. కార్యకర్తలకు ఎలాంటి ఆపద ఎదురైనా తక్షణమే సహాయం అందుతుందని వెల్లడించారు.