ఆంధ్రప్రదేశ్‌

24న నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ 44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 13: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సన్నాహం చేస్తోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈనెల 24న పీఎస్‌ఎల్‌వీ-సీ 44 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ రాకెట్ ద్వారా రోదసీలోకి పంపే మైక్రోశాట్-ఆర్ ఉపగ్రహాన్ని ఆదివారం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి రోడ్డు మార్గాన అత్యంత భారీ భద్రత నడుమ షార్‌కు చేరింది.
బెంగళూరు నుంచి తీసుకొచ్చిన ఉపగ్రహాన్ని శాటిలైట్ క్లీన్ రూమ్‌లో పెట్టి తుది పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది షార్ నుంచి ఇదే తొలి ప్రయోగం కావడం విశేషం.
జనవరిలో ప్రయోగించాల్సిన చంద్రయాన్-2 ప్రయోగం ఏప్రిల్‌కు వాయిదా పడడంతో ఈనెలలో పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే ఈ ప్రయోగాకి సంబంధింని రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. సోమవారం నుంచి రాకెట్ శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేస్తారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఉపగ్రహం భూపరిశీలన నిమిత్తం ప్రయోగిస్తున్నారు. ఇస్రో వర్గాల సమాచారం మేరకు 24న అర్థరాత్రి 11:38 గంటలకు రాకెట్ ప్రయోగం జరగనుంది.
చిత్రం..భారీ భద్రత నడుమ షార్‌కు వెళ్తున్న మైక్రోశాట్-ఆర్ ఉపగ్రహం