రాష్ట్రీయం

తొలిదశలో 769 ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలిదశలో 192 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 10,654 మంది వార్డులకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలిదశలో 4,479 గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు ‘నోటీసు’ ఇవ్వగా, ఎన్నికల కార్యక్రమం కొనసాగుతోంది. తొమ్మిది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాకపోవడం లేదా అర్హత కలిగిన నామినేషన్లు రాకపోవడంతో వీటికి ఎన్నికలు జరగడం లేదు. తొలిదశలో 3701 పంచాయతీ సర్పంచ్ స్థానాలకు 12,202 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అంటే సరాసరిన ఒక్కో స్థానానికి ముగ్గురు లేదా నలుగురు పోటీ పడుతున్నారు. అలాగే 39,822 వార్డుసభ్యుల స్థానాలకు రిటర్నింగ్ అధికారులు నోటీస్ ఇవ్వగా, 192 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాకపోవడమో, అర్హత కలిగిన నామినేషన్లు లేకపోవడం వల్ల వీటికి ఎన్నికలు జరగడం లేదు. దాంతో ఏకగ్రీవం అయిన 10654 స్థానాలు మినహాయించి మిగతా 28,976 స్థానాలకు 70,094 మంది పోటీ పడుతున్నారు.
ఇలా ఉండగా గతంలో సర్పంచ్ స్థానంతో పాటు వార్డు సభ్యుల స్థానాలకు కలిపి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహం ఇచ్చేవారు. ఐదువేల జనాభా కంటే తక్కువ ఉన్న పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే 10 లక్షల రూపాయలు, ఐదువేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు ఏకగ్రీవం జరిగితే 15 లక్షల రూపాయలు నగదు ప్రోత్సాహకంగా ఇచ్చేవారు. ఈ పర్యాయం ఎన్నికల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు ఏకగ్రీవాలకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. ఇలా ఉండగా పంచాయతీ ఎన్నికల రెండో దశలో సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు సభ్యుల స్థానాలకు కలిపి మొత్తం 1,16,877 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోదశ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా సమాచారం మీడియాకు విడుదల చేసింది. 4135 గ్రామ పంచాయతీల ఎన్నికలకు ‘నోటీస్’ జారీ చేయగా, 25,419 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 36,602 వార్డు స్థానాలకు నోటీస్ జారీ కాగా 91,458 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోదశ ఎన్నికలకు
ఈ నెల 11 నుండి 13 వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం వీటి పరిశీలన జరిగింది. 17 వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువుగా ఇచ్చారు. ఆ తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. రెండో దశ పోలింగ్ ఈ నెల 25 న జరుగుతుంది.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో
ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి దశలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 42పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఆదివారం అధికారులు అన్ని పత్రాలను పరిశీలించి ఖమ్మం జిల్లాలో 21, కొత్తగూడెం జిల్లాలో 21పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. 42సర్పంచ్ పదవులతో పాటు 316వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. రెండో దశలో ఎన్నికలు జరిగే 14మండలాల పరిధిలోని గ్రామాల్లో కూడా అధిక భాగం ఏకగ్రీవం చేసేందుకు ఆయా పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులు కూడా లోపాయికారీగా స్థానిక నేతలతో మాట్లాడుతూ ఏకగ్రీవం చేసుకుంటే ప్రభుత్వం నుంచి 10లక్షల రూపాయల నిధులు వస్తాయని చెబుతున్నట్లు తెలుస్తోంది. రెండో దశ ఎన్నికలు జరిగే 14మండలాల్లో ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుచూపిన నేపథ్యంలో ఈ ప్రాంతాలపై అందరి దృష్టి పడింది. టీడీపీ శాసనసభ్యులుగా గెలిచిన సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో కార్యకర్తలు తమ వైఖరిని చెప్పలేకపోతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ఎన్నికలకు వెళుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఘోర పరాజయం పాలైన టీఆర్‌ఎస్ నేతలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఎక్కువ మంది సర్పంచ్‌లను గెలుచుకోవడం ద్వారా ఈ రెండు జిల్లాల్లో పార్టీ బలహీనపడలేదని తమ అధినేతకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులోభాగంగా తొలి దశలో ఏకగ్రీవమైన 42పంచాయతీల్లో ఎక్కువ మందిని తమ శిబిరంలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే రెండో దశలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో కూడా ఎక్కువ మంది తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. రెండో దశ నామినేషన్ల ఘట్టం ముగియడంతో 14మండలాల పరిధిలోని సర్పంచ్ పదవులకు 1656 మంది, వార్డు పదవులకు 7,477 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కారేపల్లి మండలంలోని 41 పంచాయతీలకు అత్యధికంగా 280 సర్పంచ్ పదవులకు, 356 వార్డులకు 996 మంది పోటీ పడటం విశేషం.