ఆంధ్రప్రదేశ్‌

తిరుగు ప్రయాణాలకు 3020 ఆర్టీసీ బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 14: సంక్రాంతి సెలవుల సందర్భంగా తమ స్వగ్రామాలకు చేరిన ప్రయాణికులు తిరిగి తమ నివాస ప్రాంతాలకు చేరుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందెన్నడూ లేనివిధంగా 3020 బస్సులు సిద్ధం చేసింది. ఈ బస్సులు ఈ నెల 16 నుంచి 20 వరకు తిరుగుతాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రధానంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి రాష్ట్రేతర ప్రాంతాలకు, రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడవనున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి వివిధ జిల్లాల నుంచి 1115 బస్సులు నడుస్తాయి. హైదరాబాద్‌కు విజయవాడ నుంచి 275, గుంటూరు నుంచి 150, ఒంగోలు నుంచి 160, తూర్పుగోదావరి జిల్లా నుంచి 150, కర్నూలు నుంచి 100, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 75 బస్సులు నడుస్తాయి. ఇక బెంగళూరుకు చిత్తూరు నుంచి 200, కడప నుంచి 110, కర్నూలు నుంచి 90, నెల్లూరు నుంచి 55, అనంతపురం నుంచి 50, మిగిలిన ప్రాంతాల నుంచి మరికొన్నిటితో కలిపి మొత్తం 570 బస్సులు నడుస్తాయి. చెన్నై నగరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 202 బస్సులు నడుస్తాయి. ఇందులో విజయవాడ నుంచి 35, నెల్లూరు నుంచి 35, కడప నుంచి 35 బస్సులు నడుస్తాయి. ఇక విశాఖకు 219 బస్సులు నడవనుండగా, విజయనగరం, శ్రీకాకుళం నుంచి 110, తూర్పు గోదావరి నుంచి 72, విజయవాడ నుంచి అమలాపురం, రాజమండ్రి వైపు 175 బస్సులు, తూర్పు గోదావరి జిల్లా నుంచి విజయవాడకు 123 బస్సులు నడిపేందుకు సిబ్బందిని సన్నద్ధం చేశామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీ సురేంద్రబాబు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు.