ఆంధ్రప్రదేశ్‌

పాఠశాలలకు క్రీడా సౌకర్యాల్లో ఏపీకి ఐదో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 16: దేశంలోని వివిధ పాఠశాల్లో క్రీడా సౌకర్యాల కల్పనలో ఆంధ్రప్రదేశ్‌కు 5వ స్థానం దక్కింది. యాన్యువల్ స్టాటస్ రిపోర్ట్ ఆన్ ఎడ్యుకేషన్ - 2018లో వివిధ రాష్ట్రాల్లో క్రీడలు, క్రీడా సౌకర్యాలు, తదితర అంశాలపై నివేదికను కేంద్రం తాజాగా విడుదల చేసింది. పాఠశాలల టైమ్‌టైబుళ్లలో వ్యాయామ విద్యకు సంబంధించి ఒక పీరియడ్ కేటాయించిన రాష్ట్రాల్లో ఏపీకి ఐదో స్థానం దక్కింది. మొదటి నాలుగు స్థానాలను మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కేరళ దక్కించుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు చివరి స్థానాల్లో ఉండటం గమనార్హం.
హర్యాణా, పంజాబ్ రాష్ట్రాలు క్రీడా రంగం పరంగా ముందంజలో ఉన్నప్పటికీ, సగం పాఠశాలల్లో మాత్రమే టైమ్‌టేబుల్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పీరియడ్‌ను కలిగి ఉండటం గమనార్హం. 10లో 8 పాఠశాలలకు క్రీడా మైదానం అందుబాటులో ఉండగా, 5.8 శాతం ప్రాథమిక పాఠశాలల్లో, 30.8 శాతం ప్రాథమికోన్నత పాఠశాలల్లో మాత్రమే వ్యాయామ ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు. చాలా పాఠశాలల్లో ఇతర ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో 55.8 శాతం, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 71.5 శాతం క్రీడా పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో మెరుగైన క్రీడా పరికరాలు అందుబాటులో ఉన్నట్లు కేంద్రం నివేదికలో వెల్లడైంది.