ఆంధ్రప్రదేశ్‌

కోల్‌కతాకు చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 18: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో నిర్వహించే బీజేపీయేతర పార్టీల ర్యాలీలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం రాత్రి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలోకోల్‌కతా బయల్దేరి వెళ్లారు. కోల్‌కతాలో శనివారం ర్యాలీలో పాల్గొనటంతో పాటు మరోవిడత జాతీయ నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలు..రాష్ట్రాల హక్కుల సాధన నేపథ్యంలో నిర్వహించే ర్యాలీ ఏపీతో పాటు దేశ ప్రజలకు ఓ సంకేతాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
గత ఏడాది కాలంగా బీజేపీ నేతల ఐక్య ఫ్రంట్ ఏర్పాటు కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు జనవరిలో జాతీయ నేతలతో కలసి ఆఖరి ధర్మపోరాట దీక్షను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఈ నెలాఖరున విశాఖపట్నంలో జయహో బీసీ సదస్సుతో పాటు మంత్రివర్గ సమావేశం, వచ్చేనెల మొదటి వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో ధర్మపోరాట దీక్షను ఫిబ్రవరికి వాయిదా వేయాలనే యోచనతో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ఫెడరల్ ఫ్రంట్ తెరవెనుక ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నారనే వాదనను ఇప్పటికే చంద్రబాబు విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటవుతోందని ఇందులో భాగస్వామ్యం కావాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్ ఆహ్వానించటం తదితర అంశాలన్నింటినీ జాతీయ నేతల భేటీలో వివరించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.
ర్యాలీకి ఏఐసీసీ అధినేత రాహూల్ గాంధీని కూడా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు వారించటంతో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మల్లికార్జున ఖర్గే తదితర నేతలను పంపే అవకాశం ఉందని సమాచారం. మొదటి నుంచి కేంద్రంలో రెండే రెండు కూటములు ఉంటాయని అవి కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలో ఉంటాయని ఇప్పటికే చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిపక్ష బహుజన సమాజ్, సమాజ్‌వాదీ పార్టీల నేతలతో కూడా మరోసారి చర్చలు జరిపి ఎన్నికల అనంతరం బీజేపీయేతర కూటమికి మద్దతిచ్చేలా కూడగట్టేందుకు ఆయా పార్టీల నేతలతో సమావేశం కానున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కోల్‌కతా ర్యాలీ తరహాలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ నేతృత్వంలో త్వరలో మరో ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. రాష్ట్రాల వారీగా నిర్వహిస్తున్న ర్యాలీలతో పాటు అమరావతిలో జాతీయ నేతలతో కలసి ధర్మపోరాట దీక్ష నిర్వహించటంతో వచ్చే ఎన్నికలకు కార్యాచరణ రూపొందించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు.