ఆంధ్రప్రదేశ్‌

నన్నయ వర్సిటీలో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 18: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల కుస్తీ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సహకారంతో మూడు రోజుల పాటు పోటీలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. 16, 19 సంవత్సరాల కేటగిరిల్లో బాల బాలికలకు పోటీలు నిర్వహించారు. బాలురకు ఫ్రీస్టైల్, గ్రీక్ రోమన్ స్టైల్‌లో 10 వెయిటేజీ కేటగిరిల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎంపికైన రాష్ట్ర జట్టును రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ జట్టుగా ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు కటక్‌లో జరిగే ఆల్ ఇండియా రెజ్లింగ్ టోర్నమెంట్‌కు, జూనియర్స్ జట్టును ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు సూరత్‌లో జరిగే ఆల్ ఇండియా రెజ్లింగ్ టోర్నమెంట్‌కు పంపనున్నారు. ఐదవ రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు జరగడానికి చక్కని ఆతిథ్యం ఇచ్చిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్ కుస్తీ సంఘం జనరల్ సెక్రటరీ డాక్టర్ జి ఎలీషాబాబు కృతజ్ఞతలు తెలిపారు.