ఆంధ్రప్రదేశ్‌

తెలుగువారి గుండెల్లో కొలువైన ఎన్‌టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 18: తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన యుగపురుషుడు దివంగత నందమూరి తారక రామారావు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ శ్లాఘించారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్‌టీఆర్ 23వ వర్ధంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం, అన్నదానం, వైద్య శిబిరం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో రక్తదానం చేసి మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా సర్ట్ఫికెట్లు అందుకున్నారు. తొలుత పార్టీ కార్యాలయ ఆవరణలోని ఎన్‌టీఆర్ నిలువెత్తు విగ్రహానికి మంత్రులు లోకేష్, నక్కా ఆనందబాబు, రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్, జాతీయ పార్టీ కార్యాలయ కార్యదర్శి వివివి చౌదరి, ఎంపీ గల్లా జయదేవ్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా, దేశ రాజకీయాలను ఎన్‌టిఆర్ శాసించారన్నారు. ఆయన జీవితం నేటియువతకు ఆదర్శనీయమన్నారు. మంత్రులు నారా లోకేష్, నక్కా ఆనందబాబు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ విశ్వసించి, వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించి, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎఎస్ రామకృష్ణ, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, ఫిలిప్ సి తోచర్, పార్టీ నేతలు జయరామిరెడ్డి, పంచుమర్తి అనూరాధ, గోనుగుంట్ల కోటేశ్వరరావు, షేక్ జానీమూన్, కూచిపూడి విజయ, దేవినేని అవినాష్, బోనబోయిన శ్రీనివాసయాదవ్, బ్రహ్మంచౌదరి, ఎవి రమణ, కోవెలమూడి రవీంద్ర, మద్దిరాల ఇమ్మానియేలు, దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.