ఆంధ్రప్రదేశ్‌

జీవితాంతం ఒకటే కుల ధ్రువీకరణ పత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: ప్రతి పౌరునికి కులం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశాలకు సంబంధించి జీవితాంతం మార్పులు ఏమీ ఉండవని, అందువల్ల ఒకసారి ఇచ్చిన ధ్రువపత్రం జీవితాంతం ఉపయోగపడేలా ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పుణేఠా నిర్ణయం తీసుకున్నారు. వెలగపూడి సచివాలయంలో 5వ బ్లాక్‌లోని కలెక్టర్ల కాన్ఫరెన్సు హాల్‌లో శుక్రవారం జరిగిన కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ధ్రువపత్రాల కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి విద్యార్థులను, నిరుద్యోగులను, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను రెవెన్యూ, మీ-సేవ కేంద్రాల చుట్టూ తిప్పడం సరికాదన్నారు. ఒకసారి ఇచ్చిన సర్ట్ఫికెట్ జీవితాంతం ఉపయోగపడాలన్నారు. ఆదాయంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని, కానీ అది కూడా నాలుగేళ్ల వరకూ ఉపయోగపడుతుందన్నారు. ఈ సర్ట్ఫికెట్ల విషయంలో అన్ని శాఖల సిబ్బందికి అవగాహన కల్పించాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఐటి సలహాదారు సత్యనారాయణతో చర్చించి, సీనియర్ అధికారుల సలహాలు తీసుకుని 15 రోజుల్లో జీవో రూపొందించాలని ఆర్టీజీఎస్ సీఈవో బాబు అహ్మద్‌కు సూచించారు. అవసరం లేని పోలీస్ వెరిఫికేషన్, ఇతర సర్ట్ఫికెట్లను ఆయా శాఖలతో చర్చించి తీసేయాలన్నారు. సర్ట్ఫికెట్ల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలన్నారు. ఈ నెల 21న మంత్రివర్గ సమావేశం ఉన్నందున అందుకు అవసరమైన ఫైళ్లను సిద్ధం చేయాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. యుటిలిటీ సర్ట్ఫికెట్లు సమర్పించకపోతే వెంటనే పంపించాలన్నారు. ఇప్పటికే పంపించిన వాటి పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. కేంద్రం కొత్తగా చేపట్టిన పథకాల గురించి అధ్యయనం చేసి, నిధులను పూర్తి స్థాయిలో రాబట్టేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రతి శాఖ నుంచి కార్యదర్శి లేదా కమిషనర్ బాధ్యత వహించాలని, కుదరని పక్షంలో ఆ శాఖ ప్రతినిధిని కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో అధికారులకు, సిబ్బందికి శిక్షణ, హెచ్‌ఆర్ పాలసీ, నీటి సరఫరా, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పని భారం, లైసెన్సు మేనేజ్‌మెంట్ వ్యవస్థ, నాబార్డు నిధుల వినియోగం, వివిధ శాఖల్లో చెల్లించాల్సిన బిల్లులు, యువనేస్తం, గృహ నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. వివిధ శాఖల పనితీరు, ప్రజా స్పందనపై ఆర్టీజీఎస్ సీఈవో బాబు వివరించారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, యుసీలు, ఉపాధి హామీ పథకం తదితర అంశాల గురించి వివరించారు. ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రయత్నిస్తానన్నారు. ఈ-ఆఫీస్, ఈ-ప్రగతి ద్వారా చాలా సమయం ఆదా అవుతోందని, ప్రజలకు కూడా కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పిందన్నారు. ఈ-ఆఫీస్ నిర్వహణలో కార్యదర్శి శ్రీకాంత్‌ను అభినందించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి.సాంబశివరావు, జేఎస్వీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.