ఆంధ్రప్రదేశ్‌

ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 18: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని వైసీపీ రీజనల్ కోర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేసారు. శుక్రవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పుతోవపట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న కృషిని అందరూ హర్షించాలన్నారు. కేంద్రప్రభుత్వం మాటమీద నిలబడలేదని, కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకి ఆమోదించి, అభినందనలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి, ఆయన కేబినేట్ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీ ప్రభుత్వంపై నింద మోపడం సరికాదన్నారు. పార్లమెంటు తీసుకున్న నిర్ణయం, తదుపరి ఆనాడు ఉన్న ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్‌కు పంపించిన విషయాన్ని గుర్తుచేసారు. ఈ దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగ సభలు ఏకగ్రీవంగా అంగీకరించిన తర్వాత ఆ హక్కులు అమలుకు నోచుకోలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొంతకాలం ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీ కావాలని, మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా నినాదంతో అధికారాన్ని చేజిక్కించుకునే జిమ్మికులు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ తరుణంలో వైసీపీ అన్ని విధాలుగా నష్టపోయిన ప్రజలకు న్యాయం జరగాలని, జీవనప్రమాణాలు పెరగాలని, పరిశ్రమలు రావాలని, తద్వారా ఉద్యోగావకాశాలు కల్పించాలనే జగన్ పోరాటం చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై అభద్రతాభావం కలిగినప్పుడు పక్కనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఆహ్వానించారన్నారు. కలిసి పోటీ చేస్తామని వారు చర్చ జరపలేదని, చెప్పలేదని స్పష్టం చేసారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ దేనికైనా సిద్ధంగా ఉందన్నారు. హైకోర్టును ఏదో బడ్డికొట్టు నడిపినట్టు చిన్న గదుల్లో నడిపించే బాబు రాజధాని నిర్మించగలరా అంటూ ప్రశ్నించారు. కేంద్రంలో రాష్ట్రాల హక్కులు సాధించుకోవడం కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నప్పుడు వైసీపీ ప్రత్యేక హోదా సాధన కోసం కలిసి పనిచేసేందుకు జగన్ సిద్ధపడ్డారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశంలో ఏ రాజకీయ పార్టీతోనైనా కలిసి పోరాటం చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. కేంద్రప్రభుత్వంపై పోరాటం చేసేందుకే ఒక వేదిక కోసం కేసీఆర్ కలిసి పోరాడతామంటే కలిసి పనిచేయడానికి ముందుకు వెళ్ళామని, అటువంటి పార్టీలు దేశంలో ఎవరు ఆహ్వానించినా వారితో పనిచేస్తామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తామని అబద్ధపు ప్రచారాలను చేయవద్దంటూ బాబుకు, ఆయన కేబినేట్ మంత్రులకు హెచ్చరించారు. బాబు ఇచ్చే హామీలపై ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.