ఆంధ్రప్రదేశ్‌

దరఖాస్తుదారులందరికీ హజ్ యాత్రకు అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: 2019 హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకున్న వారందరినీ ఎంపిక చేసినట్లు హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహ్మద్ లియాఖత్ అలీ శుక్రవారం ప్రకటించారు. 2,135 మంది పెద్దలు, రెండేళ్ళ లోపు ముగ్గురు చిన్నారులు మొత్తం 2,138 మంది ఈ ఏడాది ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్ళనున్నారు. ఇందులో 40 మంది 70 ఏళ్ళు పైబడిన వారు ఉన్నారు. అనంతపూర్ జిల్లా నుంచి 298, చిత్తూరు జిల్లా నుంచి 206, తూర్పు గోదావరి జిల్లా నుంచి 39, గుంటూరు జిల్లా నుంచి 326, కడప జిల్లా నుంచి 241, కృష్ణాజిల్లా నుంచి 230, కర్నూలు జిల్లానుంచి 473, నెల్లూరు జిల్లా నుంచి 121, ప్రకాశం జిల్లా నుంచి 43, శ్రీకాకుళం జిల్లా నుంచి 7గరు, విశాఖపట్నం జిల్లానుంచి 90, విజయనగరం జిల్లా నుంచి 24, పశ్చిమ గోదావరి జిల్లా 37 మంది డ్రాతో నిమిత్తం లేకుండా హజ్ యాత్రకు ఎంపికైయ్యారు. 70 ఏళ్ళు పైబడిన యాత్రికులు 40 మంది కూడా డ్రాతో సంబంధం లేకుండా ఎంపికయ్యారు. ఇక ఈ హజ్‌యాత్రకు ఎంపికైన ప్రతి హజ్ యాత్రికుడు మొదటి విడత రూ.81,000లు ఫిబ్రవరి 5వ తేదీ లోపు సెంట్రల్ హజ్ కమిటీకి చెల్లించాల్సి ఉందన్నారు.