ఆంధ్రప్రదేశ్‌

తృతీయఫ్రంట్‌కు అవకాశం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జనవరి 18: త్వరలో జరగనున్న దేశ వ్యాప్త సార్వత్రిక ఎన్నికల్లో తృతీయఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా మడకశిరలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 42 ప్రాంతీయ పార్టీలు కలిసి విజయం సాధించినా అధికారం చేపట్టే అవకాశాలు లేవన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన అంశమైన ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుంటే ఓటమి తప్పదన్న భయం ప్రతి పార్టీని పట్టుకుందన్నారు. అందుకే ప్రజలను ఆకట్టుకునేందుకు పెన్షన్ల రెట్టింపుప్రకటనలు చేస్తున్నాయన్నారు. అయితే ప్రజలు వారి మాయమాటలను నమ్మి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ స్వాగతిస్తుందన్నారు. తెలంగాణ అంశం ఎంత ముఖ్యమో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా కూడా అంతే ముఖ్యమన్నారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి 200 సీట్లు దక్కుతాయన్నారు.
సరైన సమయానికి ఎన్నికలు నిర్వహిస్తే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని రఘువీరా ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి చెప్పుకోదగిన రాష్ట్రం ఏదీ లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా తెలంగాణ తరహాలో ఆలస్యం చేయకుండా ముందుగానే ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు.