ఆంధ్రప్రదేశ్‌

త్వరలో ఏపీకి కొత్త గవర్నర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: రాష్ట్ర విభజన జరిగిన దాదాపు నాలుగున్నర సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో గవర్నర్‌ను నియమించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న కిరణ్‌బేడీని ఏపీ గవర్నర్‌గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీ కాలం చాలా కాలం క్రితమే ముగిసినప్పటికీ, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఆయనే రెండు రాష్ట్రాలకూ గవర్నర్‌గా కొనసాగుతారని కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఏపీకి గవర్నర్ నియామకంపై కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ద్వివేదిని నియమించిన నేపథ్యంలో వ్యూహాత్మకంగా గవర్నర్ నియామకంపై కేంద్రం వ్యవహరించనున్నట్లు తెలిసింది.