ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో ఎన్నికల సర్వే ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, జనవరి 19: టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు ఎన్నికల సర్వే నిర్వహించారో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ కారెం శివాజీ ప్రశ్నించారు. శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆయన విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ 2019ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ పోలీసులతో రాష్ట్రంలో ఎన్నికల సర్వేను నిర్వహించడాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలు చూస్తున్నారని, జగన్మోహన్‌రెడ్డి కేసీఆర్, మోదీలతో కలసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్ కేసీఆర్‌తో కలసి అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇటీవల తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సమయంలో అక్కడ టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు పంపిణీ చేయగా మిగిలిపోయిన గడియారాలను రాష్ట్రానికి తరలించారని శివాజీ తీవ్ర విమర్శలు చేశారు. ఆ గడియారాలపై జగన్మోహన్‌రెడ్డి స్టిక్కర్లు ఉన్నాయని, ఆ స్టిక్కర్లను తొలగిస్తే కేసీఆర్, కేటీఆర్ స్టిక్కర్లు కనిపిస్తున్నాయని తెలిపారు. కోడికత్తికేసు విషయంలో జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర పోలీసులను ఎందుకు నమ్మడంలేదని, ఆయన అధికారులను, ప్రజలను నమ్మరని, ఆయనను ప్రజలు నమ్మరని ఎద్దేవాచేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ నాయకురాలు కవిత సుప్రీమ్ కోర్టులో కేసు వేసిన విషయం జగన్‌కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. కాకినాడకు రావలసిన పెట్రోకారిడార్, విశాఖ రైల్వేజోన్, విజనచట్టంలో పేర్కొన్న అంశాలు రాష్ట్రానికి రాకుండా ప్రధాని మోదీ, అమిత్‌షాలతో కలసి అడ్డుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ కార్యక్రమాలను ఏరులై పారిస్తున్నారని, వృద్ధులకు, వివిధ వర్గాలకు పెద్ద ఎత్తున పింఛన్లు పెంచారని శివాజీ కొనియాడారు. శాసన సభలో ప్రజాసమస్యలపై జగన్మోహన్‌రెడ్డి ఎన్నడూ మాట్లాడలేదని, పాద యాత్రలు పేరుతో నాటకం ఆడారని ఆరోపించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడానికి జగన్ కారకుడయ్యారని, ఆయనను రాష్ట్ర ప్రజలు నమ్మరని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ శివాజీ అన్నారు.
ఈ సందర్భంగా 15మంది ఒంటరి మహిళలకు ఆయన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 60వేల రూపాయలు పూర్తిసబ్సిడీతో కూడిన రుణాలను అందజేశారు. ఈ విలేఖరుల సమావేశంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షులు ధనరాశి శ్యామ్‌సుందర్, ఎస్సీ నాయకులు కాకర శ్రీనివాస్, ఏ. సత్యనారాయణ, జార్జి చక్రవర్తి, పలివెల సత్యనారాయణ పాల్గొన్నారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర ఛైర్మన్ కారెం శివాజీ