ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి పట్టిన దుష్టద్వయం కేసీఆర్, జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, జనవరి 19: తెలంగాణా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈ రాష్ట్రానికి దుష్టద్వయంలా దాపురించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్ అండ్ బీ మంత్రి అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. వీరిద్దరూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రులు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధిని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశం మొత్తం గమనిస్తోందన్నారు. గత ఎన్నిలకు ముందు గుంటూరు, తిరుపతి సభల్లో ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోదీ చెప్పారని, దానినే మనం అడుగుతున్నామన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం జెండా మళ్లీ ఎగరటం, చంద్రబాబునాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడిని కేసీఆర్ అనవసరంగా తిడుతున్నారని, ఇది ప్రజలు గమనించాలన్నారు. కేసీఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు. కేసీఆర్ సభ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. జగన్ దొంగ అన్న కేటీఆర్ తిరిగి జగన్‌ను ఎందుకు కలిశాడో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. అదే విధంగా కేసీఆర్ కుమార్తె కవిత, అల్లుడు హరీష్‌రావు కూడా జగన్‌ను తిట్టి తిరిగి ఆయనతో స్నేహం కొనసాగించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కేంద్రం నుండి ఎలాంటి సహాయం అందకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. గుజరాత్ రాష్ట్రం కన్నా మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందనే అక్కసుతో రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదన్నారు.