ఆంధ్రప్రదేశ్‌

ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 19: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ప్లెక్సీలు, ఇతర ప్రచార సాధనాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. శనివారం ఒంగోలులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నాయకులు వేసిన ఫ్లెక్సీల్లో ఉన్న అభివృద్ధి క్షేత్రస్థాయిలో కన్పించడం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయడంలో అభివృద్ది సాధించిందని ఆయన ఎద్దేవా చేశారు. రాజధాని భూములను తాకట్టు పెట్టి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పులు తెస్తున్నాడని కానీ రాజధాని నిర్మాణం మాత్రము జరగటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. విభజన సమయంలో రాష్ట్రం 94వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంటే నేడు 2 లక్షల 49వేల కోట్ల రూపాయల మేర అప్పుల్లో ఉందన్నారు. ఇదేనా అభివృద్ది అంటే అని ఆయన నిలదీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ప్రంట్‌పై స్పందిస్తూ అది కేవలం మోదీకి అనుకూలమని, మోదీ మెహర్బాని కోసం ఏర్పాటు చేసినదేనన్నారు. చంద్రబాబు పరిపాలన దక్షుడుగా ప్రచారం చేయడం తప్ప ఆయన చేసిందీ ఏమీ లేదన్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన మోదీపై వైకాపా నేత జగన్ సరైన రీతిలో నిలదీయడం లేదని విమర్శించారు.