ఆంధ్రప్రదేశ్‌

జగన్ వస్తే పింఛన్ల రద్ద్దే: కారెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జనవరి 20: జగన్ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడుపై అక్కసుతో ప్రస్తుతం ఇస్తున్న అన్ని పింఛన్లు రద్దు చేస్తాడని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ అన్నారు. గత ప్రభుత్వం రూ.200 ఇచ్చిన పింఛన్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.2000కు పెంచారని, ఈ పింఛన్లను జగన్ అధికారంలోకి వస్తే రద్దుచేయడం ఖాయమన్నారు. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగాం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో శివాజీ మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహాన్ రెడ్డి తెలంగాణలో నివసిస్తూ రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చడానికి కారకుడైన కేసీఆర్‌తో కలసి ఏపీ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటున్నాడన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్‌ను ప్రతిపక్ష హోదాలో కూర్చోపెడితే ఏనాడైనా అసెంబ్లీలో రాష్ట్భ్రావృద్ధి కోసం మాట్లాడారా అని శివాజీ ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ముఖ్యమంత్రితో సహా మిగిలిన పార్టీలు సీపీఎం, సీపిఐ సహా ఇతర పార్టీ నేతలంతా రాష్ట్ర రాజధాని అమరావతిలో తమ నివాసాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్ర ప్రజల గురించి, అభివృద్ధికోసం పాటు పడుతుంటే జగన్మోహన్ మాత్రం తెలంగాణ రాష్ట్రం విడిచి రాకుండా ప్రజా సమస్యలపై దృష్టిపెట్టకుండా ముఖ్యమంత్రి అవడానికి ఉవ్విళ్ళూరుతున్నాడన్నారు. ఇటువంటి వ్యక్తికి రాష్ట్ర ప్రజలే తగిన బుద్ధి చెపుతారన్నారు. తనపై దాడి, తన సోదరిపై వచ్చిన పుకార్లపై రాష్ట్రంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఫిర్యాదు చేస్తాడని, రాష్ట్రంలోని వ్యవస్థలపై నమ్మకం లేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అవుతాడని శివాజీ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో పోలవరం ప్రాజెక్టు గేట్లు పెట్టేస్థాయికి వచ్చిందని,. జగన్ కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కై అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం, కాకినాడ పెట్రోకాడార్‌లపై ఏనాడైనా జగన్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాడా అని శివాజీ ఎద్దేవా చేసారు. ప్రజలందరూ రాజీకయంగా, ఆర్ధికంగా ఎదగడమే తెలుగుదేశం ప్రభుత్వం ఆశయమని దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఆయననే మళ్లీ ప్రజలు అధికారంలోకి తీసుకువాలని శివాజీ పిలుపునిచ్చారు.