ఆంధ్రప్రదేశ్‌

2019-20 బడ్జెట్‌కు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 21: వచ్చే 2019-20 ఆర్థిక సంవత్సరం ఏపీ వార్షిక బడ్జెట్‌కు కసరత్తు ప్రారంభమైంది. ఈ విషయమై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. బడ్జెట్ రూపకల్పనపై అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. కాగా మంగళవారం నుంచి నాలుగురోజుల పాటు సచివాలయంలో ఆయా శాఖల అధికారులతో ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళవారం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పౌరసరఫరాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా, శిశు సంక్షేమం, గ్రామీణ గృహనిర్మాణ, కార్మిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. 23న మానవ వనరుల అభివృద్ధి, గ్రామీణ, పంచాయతీరాజ్, రవాణా, రోడ్లు, భవనాలు, ఆరోగ్య, జలవనరులశాఖల అధికారులతో, 25న సాధారణ పరిపాలన, ఐటీ, సమాచార ప్రసారాలు, ప్రణాళిక, పర్యాటకశాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. వచ్చేనెల 30 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నందున ఈలోగా బడ్జెట్‌కు తుది రూపు తీసుకురావాలని భావిస్తున్నారు.