ఆంధ్రప్రదేశ్‌

కమీషన్లు దండుకోవడంలో కన్నాను మించినోళ్లు లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 21: ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లో కమీషన్‌లు దండుకున్నారని, ఈ విషయంలో ఆయన్ను మించిన వారెవ్వరూ లేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ ఆరోపించారు. సోమవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. అవినీతి పరుడైన కన్నాకు అందరూ అందరూ అలాగే కనిపిస్తుంటారన్నారు. ఎన్డీఏ నుండి తెలుగుదేశం బయటకు వచ్చిన తర్వాత బీజేపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును అవినీతి పరుడంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, కలిసి ఉన్నప్పుడు నీతిమంతుడు, విడిపోతే అవినీతి పరుడా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తున్న కన్నా లక్ష్మీనారాయణ లెక్కలను చెప్పాలని, లేకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద నోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తే 1000, 500 నోట్లు రద్దుచేసి, మరలా 2000 రూపాయల నోట్లు తీసుకువచ్చి ప్రజలను అవస్థల పాలు చేశారన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సుమారు 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టి దేశానికే ఏపీ ఆదర్శవంతంగా నిలిచిందన్నారు. కేంద్రం నుంచి సాయం అందకున్నా అభివృద్ధిలో బీజేపీ పాలిత రాష్ట్రాలను మించి అభివృద్ధి చేయడంతో ప్రధాని మోదీ ఓర్వలేక పోతున్నారన్నారు. అందుకే అసత్యాలు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందుకు కన్నా లాంటి స్వార్థపరులు అండగా నిలుస్తున్నారన్నారు. ఏపీలో పరిశ్రమలను కేంద్రం మంజూరు చేసిందంటున్న బీజేపీ నేతలు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలన్నీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చొరవతోనే వచ్చాయని, మోదీ చేతగాని సీఎం అంటే ఆ పార్టీ నేతలు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. ప్రతి వారం ఒక కేంద్రమంత్రి రాష్ట్రంలో పర్యటించి ఏం సాధిస్తారని, కడప స్టీల్ ప్లాంట్ గురించి మాటమాత్రం తమకు తెలియదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజనాధ్‌సింగ్ చెప్పడంతో కేంద్రం కుటిలతత్వం ప్రజలకు అర్థమవుతోందన్నారు. 2019 ఎన్నికల్లో మోదీకి, బీజేపీ ప్రభుత్వానికి, ప్రతిపక్ష వైసీపీ డిపాజిట్లు కూడా దక్కవని యామినీ శర్మ జోస్యం చెప్పారు.