ఆంధ్రప్రదేశ్‌

ఆ అణుపదార్థం అత్యంత ప్రమాదకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, జనవరి 21: అత్యంత ప్రమాదకరమైన సీసీఎం-137 అనే అణుపదార్ధం అదృశ్యం కావడానికి బాధ్యులైన రాజమహేంద్రవరం ఎన్జీసీ అధికారులను తక్షణం సస్పెండ్‌చేసి, అరెస్టుచేయాలని అమలాపురం పార్లమెంటు సభ్యుడు పండుల రవీంద్రబాబు డిమాండ్ చేశారు. అణుపదార్థాన్ని భూమిలో చమురు, సహజవాయు నిక్షేపాలు ఉన్నాయో లేవో అనేది తెలుసుకోవడానికి ఉపయోగిస్తారన్నారు. ఇది తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్తే దేశానికే పెను ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. సీసీఎం-137 అనే అణుపదార్ధం అత్యంత ప్రమాదకరమైందన్నారు. రష్యాలోని చెర్నోబిల్ ప్రాంతంలో గతంలో ఈ తరహా అణుపదార్ధం లీకైన కారణంగా పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని గుర్తుచేశారు. ఈ పదార్ధం చాలా చిన్నదని, దీని ఖరీదు రూ.30 లక్షలు మాత్రమే ఉంటుందని, దీనివలన పెద్దగా నష్టం ఉండదంటూ రాజమండ్రి ఓఎన్జీసీ అధికారులు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. అణుబాంబు, ఇతర వైరస్‌లు చాలా చిన్నగానే ఉంటాయని, వాటిని నిర్లక్ష్యం చేస్తే ఎంతటి పెను ప్రమాదం సంభవిస్తుందో ప్రపంచానికి తెలుసునన్నారు. అత్యంత ప్రమాదకరమైన అణుపదార్ధం బంటుమిల్లి ప్రాంతానికి తీసుకువెళ్లి, అనంతరం ఎందుకు అదృశ్యం అయిందో విచారణ జరపాలన్నారు. దీని కారణంగా రాజమండ్రికి చెందిన ప్రజలకు మరోసారి నష్టం జరగకూడదని భావిస్తు అధికారులను హెచ్చరిస్తున్నానని ఎంపీ రవీంద్రబాబు చెప్పారు. రేడియో ధార్మికశక్తిగల అణుపదార్థాన్ని రాజమండ్రి కార్యాలయం నుండి బయటకు తీసుకువెళ్లడం, బయట నుండి తిరిగి కార్యాలయానికి తీసుకురావడం ప్రత్యేక రక్షణ దళం పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. ఈ పదార్థాన్ని బయటకు తీసుకువెళ్లే సమయంలో, బయట నుండి తిరిగి కార్యాలయానికి తీసుకువచ్చే సమయాల్లో లాగ్‌బుక్‌లో నమోదుచేస్తారని వివరించారు. అలా అత్యంత భద్రతలో ఉంచాల్సిన అనుపదార్ధం అదృశ్యం అయ్యిందని చెప్పారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఓఎన్జీసీ ఛైర్మన్ శశిశంకర్‌కు లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. గతంలో ఓఎన్జీసీ అధికారులు చేసిన తప్పిదాల కారణంగా పాశర్లపూడిలో జరిగిన బ్లోఅవుట్‌ను, నగరంలో జరిగిన ప్రమాదంలో సుమారు 30మంది కాలిబూడిదయిన సంఘటనను మన మందరం చూశామన్నారు. మరోసారి ఇటువంటి ప్రమాదం మనం చూడకూడదని భావిస్తున్నట్లు ఎంపీ రవీంద్రబాబు ఆవేదన వెలుబుచ్చారు. రాజమండ్రి ఓఎన్జీసీ అధికారులను అణుపదార్ధం అదృశ్యం కావడానికి గల కారణాలపై వివరణ అడిగేందుకు ఫోన్‌చేసినా వారు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేజీ బేసిన్ నుండి ఓఎన్జీసీ సంస్థ ప్రతీ సంవత్సరం రూ.200 నుండి రూ.300 కోట్ల లాభాన్ని ఆర్జిస్తూ ప్రజల రక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఆ సంస్థ పూర్తిగా వ్యాపార దృక్పథంతోనే వ్యవహరిస్తోందన్నారు. అణుపదార్ధం అదృశ్యం కావడానికి గల కారణాలపై ఆ సంస్థ స్పందించకుంటే ప్రజలతో కలసి ఉద్యమిస్తానని ఎంపీ రవీంద్రబాబు హెచ్చరించారు. రాజమండ్రి ఓఎన్జీసీ సంస్థ అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ తన బాధ్యతలను పూర్తిగా విస్మరించి ఓ రాజీయ వేత్తలా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
చిత్రం..విలేఖర్లతో మాట్లాడుతున్న ఎంపీ రవీంద్రబాబు