ఆంధ్రప్రదేశ్‌

ఏపీ హైకోర్టు పనివేళల్లో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 22: ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్ధానం హైకోర్టు పని వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త పనివేళలను సూచిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త పనివేళల ప్రకారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, భోజన విరామం తర్వాత తిరిగి మధ్యాహ్నం 2:15 గంటల నుంచి సాయంత్రం 4:15గంటల వరకు కోర్టులు పని చేస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాత్కాలిక హైకోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారు
ఇదిలావుండగా రాజధానిలో తాత్కాలిక హైకోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం హైకోర్టును తాత్కాలికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం పూర్తయినందున ఫిబ్రవరి 3వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆహ్వానించనున్నారు.