ఆంధ్రప్రదేశ్‌

పోలవరానికి సందర్శకుల తాకిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 23: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణ దశలోనే తిలకించేందుకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన సందర్శకులతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా మారింది. ప్రభుత్వం పనిగట్టుకుని మరీ విద్యార్థులు, రైతులు, డ్వాక్రా సంఘాలకు ఆతిధ్యమిచ్చి మరీ పోలవరానికి ఆహ్వానిస్తోంది. ఆర్టీసీకిదో ఆదాయంగా మారింది. దూర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులను, మహిళలను, డ్వాక్రా మహిళలను ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చి వారికి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ఆధ్యంతం చూపించి అక్కడనే భోజనం పెట్టి మరీ సందర్శకులను సాగనంపుతున్నారు. ఇక్కడ సందర్శకులకు ప్రాజెక్టుపై వివరించేందుకు జల వనరుల శాఖకు చెందిన కొంత మంది అధికారులు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా భోజనాలు పెట్టేందుకు ప్రత్యేక కాంట్రాక్టు అప్పగించారు. ఈ పోలవరం ప్రాజెక్టుపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకించి విద్యార్థులు, రైతులను ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు, రైతులు, స్వయంగా వచ్చిన వారితో కలిపి గత ఏడాది ఏప్రిల్ 23వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు 330370 మంది సందర్శించారు. అమరావతి నుంచి 576 మంది, అనంతపురం జిల్లా నుంచి 5960 మంది, చిత్తూరు జిల్లా నుంచి 4868, తూర్పు గోదావరి జిల్లా నుంచి 7650 మంది, గుంటూరు నుంచి 56676 మంది, కడప 3934, కృష్ణా 178794, కర్నూల్ జిల్లా నుంచి 3513, నెల్లూరు నుంచి 1694, ప్రకాశం 8814, శ్రీకాకుళం జిల్లా నుంచి 3160, విశాఖపట్నం నుంచి 4230, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 20772, ఇతరులు, విద్యార్ధులు కలిపి 12720 మంది వెరసి దాదాపు 3.50 లక్షల మంది వరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని సందర్శించారు. మొత్తం 241 రోజుల్లో 3,50,090 మంది సందర్శించారు. స్థానిక నాయకులు ప్రతీ వారం వారం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళలను ప్రాజెక్టుకు తీసుకొచ్చి వారికి ప్రాజెక్టు ప్రత్యేకతను వివరించి భోజనాలు పెట్టి పంపిస్తున్నారు. ఇక్కడ భోజన ఏర్పాట్లను నిర్వహించేందుకు రూ. కోట్ల ఖర్చుతో కాంట్రాక్టు అప్పగించినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తవకుండానే పర్యాటక ప్రాంతంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి పాల్గొనే సభల్లో కూడా డ్వాక్రా మహిళలు పోలవరం ప్రాజెక్టు వివరాలపై అనర్గళంగా మాట్లాడే విధంగా అవగాహన కల్పించడంలో టీడీపీ నాయకులు కృతకృత్యులయ్యారని చెప్పొచ్చు.