ఆంధ్రప్రదేశ్‌

పవిత్ర క్షేత్రం తిరుమలపై అపనిందలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధమైన మహిమాన్విత క్షేత్రమైన తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసి, తద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంటే, అందుకు ప్రతిపక్షమైన వైసీపీ సహాయ సహకారాలు అందించడం హేయమైన చర్య అని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య మండిపడ్డారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేఖర్లతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జనాదరణ కోల్పోతున్న బీజేపీ ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఇటువంటి అపవిత్ర చర్యలకు పాల్పడుతోందన్నారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా, తెలుగువారి ఆరాధ్యదైవంపై అపనిందలు వేయడం బీజేపీ నేతలకే చెల్లిందన్నారు. టీటీడీలో జరిగే ప్రతి కార్యాన్ని, చర్యను తప్పుపడుతూ, గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం, తిరుమలలపై బీజేపీ చేస్తున్న రాజకీయాలు ఎంత మాత్రం క్షమార్హం కాదన్నారు.
దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న బీజేపీకి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆనంద్ సూర్య హెచ్చరించారు. గతంలో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్వామి వారికి ఏడు కొండలు లేవు, రెండు కొండలే ఉన్నాయంటూ తిరుమల పవిత్రత మంటగలిపేలా జీవో ఇచ్చినప్పుడు బీజేపీ నేతలంతా ఏం చేశారని ఆయన నిలదీశారు.
కేంద్ర పురావస్తుశాఖ ఏదో లేఖ ఇచ్చిందనే సాకుతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా, వైసీపీ సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ గవర్నర్‌కు తప్పుడు ఫిర్యాదు చేశారని ఆనంద్ సూర్య స్పష్టం చేశారు. వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ఇచ్చిన అనేక హామీలను విస్మరించి ఆడిన మాట తప్పిన మోదీని ఆ స్వామివారే తగిన విధంగా శిక్షిస్తారని ఆయన తెలిపారు.