ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో బైబిల్ మ్యూజియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: రాజధాని అమరావతి ప్రాంతంలో బైబిల్ మ్యూజియం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో మంత్రిని బుధవారం కొంతమంది క్రైస్తవ మతపెద్దలు కలిసి మ్యూజియం నమూనాలను చూపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10రోజుల్లో డిజైన్లు ఖరారు చేసి టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఈ మ్యూజియంలో బైబిల్‌లోని ప్రముఖ చారిత్రక ఘటనలు వివరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మ్యూజియంలో వనం, నోవోక్షగ, మంద సభ పెట్టే వంటి వాటి నమూనాలు ఏర్పాటు చేయాలని మంత్రికి మతపెద్దలు తెలిపారు. కోల్‌కతా సిరంపూర్ వర్సిటీ తరహాలో అమరావతిలో కూడా వర్సిటీ ఏర్పాటుకు 3 ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఎం.జోసఫ్ ఇమ్మానియేల్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మంత్రి నక్కా ఆనందబాబుతో సమావేశమైన క్రైస్తవ మతపెద్దలు