ఆంధ్రప్రదేశ్‌

వైసీపీలోకి కోట్ల సోదరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, జనవరి 23: కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్దన్‌రెడ్డి వైకాపాలో చేరనున్నారు. కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న హర్షవర్దన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో వైకాపా అధినేత జగన్‌ను కలిసి సుమారు గంట సేపు మాట్లాడారు. ఫిబ్రవరి 6వ తేదీ అనుచరులతో కలిసి వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నట్లు హర్షవర్దన్‌రెడ్డి తెలిపారు. కోట్ల కుటుంబం మనుగడను కాపాడేందుకే వైకాపాలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.