ఆంధ్రప్రదేశ్‌

పల్లెపల్లెకూ టీడీపీ సంక్షేమ పథకాల ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 23: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో ఏపీ అభివృద్ధి పథాన ముందుకు దూసుకెళ్తోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పల్లె పల్లెకు ప్రచారం ప్రచారం చేస్తామని సినీనటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆమె విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజునే మంత్రి నారా లోకేష్ పుట్టడం సంతోష దాయకమన్నారు. చిన్న వయస్సులోనే మంత్రి పదవి చేపట్టి తనదైన శైలిలో తండ్రికి తగ్గ తనయుడుగా పరిపాలనలో పాలు పంచుకుంటున్నారన్నారు. చంద్రబాబునాయుడు, లోకేష్‌లు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతుంటే కొంతమంది కక్షపెంచుకుని రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందుతున్నాయని, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ మరలా అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ దేశంలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వచ్చి ప్రజలకు సుపరిపాలన అందించేందుకు తమవంతుగా కృషిచేస్తామని దివ్యవాణి తెలిపారు.